భారత దేశ ప్రధమ పౌరుడు రామ్‌నాథ్ కోవింద్ అమరావతిలో టెక్నాలజీ చూసి ఫిదా అయిపోయారు... ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రెజెంటేషన్ తో, రాష్ట్రపతి ఆశ్చర్యపోయారు... రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ లో ఇన్ని అద్భుతాలు చేస్తున్నారు... కొత్త రాష్ట్రం, పక్క రాష్ట్రాలతో పోటీ పడి ముందంజులో ఉంది.. మీకు ఎవరూ పోటీ కాదు... ఐ యాం ప్రౌడ్ అఫ్ యు అంటూ ముఖ్యమంత్రిని అభినందించారు... ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, ఇలాంటిది దేశం మొత్తం ఉండాలి... మీరు అన్ని రాష్ట్రాలకి ఈ విషయం గురించి చెప్పండి... వారు కూడా ఇది ఇంప్లెమెంత్ అయ్యేలా చెయ్యండి... ఢిల్లీ వచ్చి ప్రధాని మోడీకి కూడా ఈ ప్రెజెంటేషన్ ఇవ్వండి, ఇది ఒక అద్భుతం అంటూ కొనియాడారు... మరి ప్రధాని మోడీ, రాష్ట్రపతి మాటలు వింటే ఎలా రియాక్ట్ అవుతారో...
అంతకు ముందు రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ కు వచ్చిన రాష్ట్రపతికి, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఈ సెంటర్ ద్వారా ఏమి చేస్తాం అనేది ప్రెజెంటేషన్ ఇచ్చారు... నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఆసియా ఖండంలోనే పెద్ద రియల్ టైమ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పని విధానాన్ని దాని ప్రత్యేకతలను రాష్ట్రపతికి చంద్రబాబు వివరించారు. అంతేకాకుండా ఆసియాలోనే అతిపెద్ద 66 అడుగుల పొడవైన వీడియో వాల్ పై సెంటర్ సాంకేతిక నైపుణ్యతను ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకతల్లో ఒకటైన పీపుల్స్ హబ్ ను కూడా రాష్ట్రపతి వీక్షించారు. పోలవరం పనులు లైవ్ చూసారు...
ప్రజా సాధికార సర్వే ద్వారా రాష్ట పౌరుల వివరాలను ఆధార్ తో అనుసంధానం చేసి రూపొందించిన డేటాను చంద్రబాబు చూపించారు. మొత్తం 4.80 కోట్ల మంది ప్రజల డేటాను రాష్ట్రపతి దృషికి తీసుకువచ్చారు. ప్రభుత్వం వివిధ వర్గాలకు ప్రజలకు అందిస్తున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాల వివరాలను వివరించారు. దీంతో పాటు ల్యాండ్ హబ్ కాంప్రహెన్సివ్ ఫైనానియల్ మేనేజ్మెంట్ సిస్టమ్(సీఎఫ్ఎమ్ఎస్), ఈ-ఆఫీస్, ఈ-అటెండెన్స్ తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ప్రభుత్వం నేరుగా తీసుకునే పరిష్కార వేదిక పనితీరు వాటి పరిష్కారం పై రాష్ట్రపతికి ప్రత్యక్షప్రసారం ద్వారా చూపించారు. అంతే కాకుండా పత్రికలు, సోషల్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రజా సమస్యల కథనాలను సుమోటోగా స్వీకరిస్తున్న విధానాన్ని సైతం వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ఈ ప్రగతిలో పొందుపరుస్తున్న విధానాన్ని రాష్ట్రపతికి తెలియజేసారు. ఈ సందర్భంగా ఇటీవల ఆధునీకరించిన 2.0 వెర్షన్ కోర్ డ్యాష్ బోర్డును రాష్ట్రపతి ప్రారంభించారు.