టెన్త్ ఫలితాలు తెలుసుకునేందుకు విద్యార్థులు, వారి తల్లితండ్రులు ఆర్టీజీఎస్ వెబ్సైట్, దాని అనుబంధ పీపుల్స్ ఫస్ట్, కైజాలా యాప్ ఉపయోగించుకునేందుకు పోటీ పడ్డారు. టెన్త్ ఫలితాలులను ఆర్టీజీఎస్ సహా వివిధ యాప్‌ల ద్వారా తెలుసుకునేందుకు ఆర్టీజీఎస్ వీలు కల్పించింది. ఫలితాలు వెలువడిన వెంటనే వాటిని వెబ్సైట్లో పొందుపరిచారు. దీంతో కొన్ని సెకన్ల వ్యవధిలోనే వేలాదిమంది విద్యార్థులు తమ ఫలితాల కోసం ఆర్టీజీఎస్, దాని అనుబంధ యాప్‌లను సెర్చ్ చేశారు. టెన్త్ ఫలితాల కోసం దాదాపు 8.5 లక్షల హిట్లు నమోదు కావడం గమనార్హం. ఇందులో 4.14 లక్షల మంది తమ ఫలితాలను ఆర్టీజీఎస్ వేదికను ఉపయోగించుకుని డౌన్ లోడ్ చేసుకోవడం గమనార్హం.
ఆర్టీజీఎస్ వెబ్సైట్లో 5 లక్షల మంది ఫలితాల కోసం శోధించారు. దాని తరువాతి స్థానంలో 1.76 లక్షల హిట్స్‌తో పీపుల్స్ ఫస్ట్ యాప్ నిలచింది. ఖైజాలా యాప్ ద్వారా 44,541 మంది శోధించగా, 33,200 మంది ఫలితాలు డౌన్లోడ్ చేసుకున్నారు. ఏపీఫైబర్ నెట్ టీసీ స్క్రీన్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకునే వీలు ఆర్టీజీఎస్ కల్పించింది. ఇంట్లో టీవీ తెరపై హాల్ టికెట్ నెంబర్ టైప్ చేయగానే, తమ ఫలితాలు ప్రత్యక్షమవడం విద్యార్థులకు వింత అనుభూతిని ఇచ్చింది.