ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ రోజు ఎప్పుడూ చూడని సంఘటనలు ప్రజలు చూసారు. అదే చంద్రబాబు ఏకంగా స్పీకర్ ముందు, కింద కూర్చుని నిరసన తెలపటం. చంద్రబాబు ఎందుకు ఇంత నిర్ణయం తీసుకున్నారు ? ఎన్నో చూసిన చంద్రబాబు, ఎందుకు ఇలా రియాక్ట్ అయ్యారు ? వైసిపీ చెప్పినట్టు చంద్రబాబు రౌడీజం కోసం, రేపు పేపర్ లో హెడ్ లైన్స్ లో రావటానికి ఇలా చేసారా ? అసలు నిజం ఏమిటి అంటే, చంద్రబాబు ఇంతలా నిరసన తెలపటానికి కారణం లేకపోలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏడు సార్లు వరదలు కానీ, తుఫాన్లు కానీ వచ్చాయి. ఈ ఏడాది ఖరీఫ్ నుంచి, రెండు సార్లు వారదలు, తుఫాన్లు వచ్చాయి. అయితే జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత, రైతులు కట్టుకునే ఇన్సురన్సు ప్రీమియం మేమే కడతాం అని చెప్పింది. అయితే ఈ రోజు రైతులకు ఇచ్చే నష్ట పరిహారం పై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు ప్రభుత్వం చేసిన పనులు అన్నీ చెప్తూ, మా ప్రభుత్వంలో రైతులు ఆనందంగా ఉన్నారని చెప్పారు. అన్ని పధకాలు చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈ సందర్భంగా, తెలుగుదేశం వైపు నుంచి పయ్యావుల కేశవ్, రైతులకు కట్టాల్సిన క్రాప్ ఇన్సురన్స్ ప్రభుత్వం కట్టలేదని, వారిని ముంచేసారని నినాదాలు చేసారు. అయితే మంత్రి మాత్రం, మేము కట్టాం అంటూ ఎదురు దాడి చేసారు. దీంతో కేశవ్ మా దగ్గర మొత్తం సమాచారం ఉందని, ఆర్టిఐ ద్వారా మొత్తం సమాధానం తెప్పించాం అని చెప్పటంతో, అప్పుడు మంత్రి మాట మార్చి, డిసెంబర్ 15 లోపు ఇన్సురన్సు ప్రీమియం కడతామని చెప్పారు.

payyavula 30112020 2

అయితే ప్రభుత్వం మాట మార్చటంతో, చంద్రబాబు తమకు ఈ విషయం పై మాట్లాడే అవకాసం ఇవ్వాలని కోరటం, ఆయనకు మైక్ ఇవ్వటానికి వీలు లేదు, ఏదైనా రామా నాయుడే మాట్లాడాలి అని జగన్ చెప్పటంతో, ఈ విషయం చివరకు చంద్రబాబు ధర్నా చేసి, సస్పెండ్ చేసే దాకా వెళ్ళింది. అయితే ప్రభుత్వం ఈ ఇన్సురన్సు విషయంలో ఎందుకు ఇంట కంగారు పడింది అనేది చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టే దాకా తెలియలేదు. ఆయన మాట్లాడుతూ, తాము ఆర్టిఐ ద్వారా సమాచారం తెప్పిస్తే, 1300 కోట్లు ఇన్సురన్సు ప్రీమియం కట్టాల్సి ఉండగా, ప్రభుత్వం కేవలం 33 కోట్లు మత్రమే కట్టిందని సమాచారం వచ్చిందని, ప్రభుత్వం మొత్తం కట్టి ఉంటె ఇప్పటి నష్టానికి దాదాపుగా 2 వేల కోట్లు వచ్చేదని అన్నారు. అలాగే పోయిన ఏడాది ఎన్నో విపత్తులు వచ్చిన, అసలు ప్రభుత్వం ఇన్సురన్సు క్లెయిమ్ కూడా చేయలేదని తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు కట్టలేదని, కట్టామని ఫేక్ సమాచారం చెప్పారని,మేము ఆధారాలు చూపిస్తే, త్వరలో కడతాం అంటూ, మమ్మల్ని ఈ విషయంలో మాట్లాడనివ్వకుండా సస్పెండ్ చేసారని అన్నారు. నష్టం జరిగిపోయిన తరువాత, ప్రీమియం కడితే ఎవరైనా ఇన్సురన్సు ఇస్తారా అని ప్రశ్నించారు. అయితే దీని పై ప్రభుత్వం మాత్రం, ఇన్సురన్సు వచ్చేలా చేస్తాం అంటుంది. మొత్తానికి పయ్యావుల చెప్పిన ఒక్క విషయంతో కంగారు పడిన వైసీపీ, చివరకు అందరినీ సస్పెండ్ చేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read