రైతు రుణ ఉపశమన పథకానికి ఎదురు దెబ్బ తగిలింది. రుణమాఫీ నాలుగో విడత కింద రూ.3,900 కోట్ల నిధులు అవసరం కాగా ఆర్థికశాఖ రూ.500 కోట్లే విడుదల చేసింది. మిగిలిన రూ.3,400 కోట్లను ఇవ్వడానికి మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో బ్యాంకుల్లో నమోదు చేయించుకున్న 17 లక్షల మంది రైతులకు సొమ్ము అందని పరిస్థితి నెలకొంది. రుణమాఫీ నాలుగు, ఐదో విడతల నిధులు కలిపి రూ.7,800 కోట్లను ఇస్తామని గతేడాది ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి ఈ ఏడాది మార్చిలో ఉత్తర్వులిచ్చింది. ఆర్థికశాఖ ఈ నెల 8న రూ.500 కోట్లు విడుదల చేయడంతో రైతు సాధికార సంస్థ నాలుగో విడతకు సంబంధించి సొమ్ము బదలాయింపు చర్యలు చేపట్టింది. రైతులు తమ వద్దనున్న ఉపశమన పత్రాలను బ్యాంకులో ఇచ్చి ఎన్‌ఐసీ పోర్టల్‌లో నమోదు చేయించుకుంటే 48 గంటల్లోనే వారి ఖాతాల్లో సొమ్ము వేస్తామని స్పష్టం చేసింది.

cs 26042019

ఇది పూర్తయిన వెంటనే ఈ నెలాఖరులోగా ఐదోవిడత జమ చేస్తామంది. ఇంకా రూ.7,300 కోట్లు ఇవ్వాల్సి ఉంది. నాలుగో విడత రుణమాఫీలో మొత్తం 36 లక్షల మంది రైతులకు సొమ్ము అందాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి ప్రకటన రావడంతోనే అధిక సంఖ్యలో రైతులు అదే రోజు బ్యాంకుల వద్దకు వచ్చారు. రుణ ఉపశమన పత్రాలిచ్చి పేర్లు నమోదు చేయించుకున్నారు. ఇలా నమోదు చేయించుకున్న వారిలో 7 లక్షల మంది ఖాతాల్లోకి రూ.500 కోట్ల సొమ్మును రైతు సాధికార సంస్థ బదిలీ చేసింది. నాలుగో విడతలో ఇవ్వాల్సిన మిగిలిన రూ.3,400 కోట్ల విడుదల కోసం ఆర్థికశాఖ వైపు చూస్తోంది. ఎన్నికలకు ముందే రుణ ఉపశమన పత్రాలతో రైతులు బ్యాంకు శాఖలకు వెళ్లారు. ఎన్నికల విధులు, పనిఒత్తిడిలో ఉన్నామంటూ వాటిని తీసుకునేందుకు అధికారులు నిరాకరించారు. ఈ నెల 15వ తేదీ నుంచి నమోదు ప్రారంభించారు.

cs 26042019

వివిధ బ్యాంకుల నుంచి అందిన సమాచారం ప్రకారం సుమారు 17 లక్షల మంది రైతులు బ్యాంకుల్లో పత్రాలిచ్చి ఎన్‌ఐసీ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయించారు. వీరికి రూ.2,200 కోట్లు పైగా విడుదల చేయాల్సి ఉంది. బ్యాంకులకు వెళ్లి ఉపశమన పత్రాలు అప్‌లోడ్‌ చేయించుకోవాల్సిన వారు ఇంకా 12 లక్షల మంది వరకు ఉన్నారు. వారికి రూ.1,200 కోట్లు అవసరమవుతాయి. అయితే ప్రభుత్వ పాలన అంతా చీఫ్ సెక్రటరీ, ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జరగటం, చంద్రబాబుని నిబంధనల పేరుతొ పక్కన పెట్టటంతో, రైతులకు ఇబ్బందులు తప్పటం లేదు. 5 ఏళ్ళలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా, సంక్షేమ పధకాలకు చంద్రబాబు ఏ లోటు రానివ్వలేదు, కాని ఒక్క నెల నిబంధనల పేరుతొ ఆయన్ను పక్కన పెట్టి, రైతులకు చుక్కలు చూపిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read