విశాఖపట్నంలోని రుషికొండలో జరుగుతున్న అక్రమ తవ్వకాల పై, ఈ రోజు రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. అక్రమ తవ్వకాలకు సంబంధించి, రాష్ట్ర హైకోర్టులో విచారణ ప్రారంభం అయిన సందర్భంలో, రాష్ట్ర ప్రభుత్వం తప్పు ఒప్పుకుంది. ఇప్పటికే అక్కడ చెప్పిన దాని కంటే, 3 ఎకరాలు అదనంగా తవ్వము అని చెప్పి, కోర్టుకు తెలిపింది. అయితే దీని పై పిటీషనర్ అభ్యంతరం చెప్పారు. అక్కడ 3 కాదని, ఏకంగా 20 ఎకరాలు ఎక్కువ తవ్వేసారని, అందులోనే నిర్మాణాలు జరుగుతున్నాయని, అక్కడ తీసిన వ్యర్ధాలు అన్నీ సముద్రంలో వదులుతున్నారని, పిటీషనర్ తరుపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ వాదనల సందర్భంగా, హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇరు పక్షాలు తలో వాదన చెప్పటంతో, అసలు అక్కడ వాస్తవాలు నిగ్గు తేల్చాలని, ఎంత వరకు అక్రమ తవ్వకం జరిగిందో, నిగ్గు తేల్చలాని, అప్పుడే అక్రమ తవ్వకాల పై ఒక తీర్పు ఇస్తామని చెప్పింది. ఎంత మేరకు అక్రమ తవ్వకాలు జరిగాయి, పర్మిషన్ ఎంత వరకు ఇచ్చింది, ఎంత తవ్వారు అనేది,  కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అధికారులు తేల్చాలని హైకోర్టు ఆదేశాలు జారే చేసింది.  సర్వే నివేదికలను హైకోర్టుకు సమర్పించాలని సర్వే బృందానికి హైకోర్టు ఆదేశిస్తూ. విచారణ డిసెంబర్ 14కు వాయిదా వేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read