ఈ రోజు పార్లమెంటులో రిషికొండ తవ్వకాల అంశం ప్రస్తావనకు వచ్చింది, పర్యావరణ ఉల్లంఘనలు జరిగితే రాష్ట్ర ప్రభుత్వాలపై కూడా చర్యలు తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది అంటూ కేంద్రం సంచలన ప్రకటన చేసింది. ఈ రోజు రాజ్యసభలో బీజేపీ సభ్యుడు జీవీఎల్ ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. ఆయన స్పందిస్తూ, రిషికొండలో తవ్వకాలపై కమిటీని నియమించాం అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు కమిటీ నియామకం జరిగిందని అన్నారు. ఈ నెల12న ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించాం అని అన్నారు. నియామక ప్రకటన చేసిన నాటి నుంచి వారం రోజుల్లో రిషికొండలో పర్యటించాలని కోరాం అని కూడా ఆయన చెప్పారు. పర్యటనలో తవ్వకం పనుల గురించే కాకుండా ఏపీ హైకోర్టు వ్యక్తం చేసిన ఇతర అభిప్రాయాల గురించి కూడా పరిశీలన చేయాలని కోరడం జరిగిందని చెప్పారు. పర్యటన పూర్తయ్యాక 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కోరాం అని అన్నారు.పర్యావరణ పరిరక్షణ కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని తెలిపారు. ఉల్లంఘనలు జరిగితే పర్యావరణ చట్టాల ప్రకారం సంస్థలు, అధికారులు.. రాష్ట్ర ప్రభుత్వాలపై చర్యలు తీసుకునే అధికారం కేంద్రానికి ఉందని రాజ్యసభలో కేంద్ర పర్యావరణ సహాయ మంత్రి అశ్వినీకుమార్ చూబే స్పష్టం చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read