తూర్పుగోదావరి జిల్లాలో లాంచీ ప్రమాదం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా తూరులో, శబరి వంతెన వద్ద, ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. శబరి వంతెనకు లాంచీ వచ్చి గట్టిగా తగలటంతో, లాంచీ రెండు ముక్కలు అయినట్టు చెప్తున్నారు. ప్రమాద సమయంలో లాంచీలో నలుగుర సిబ్బని ఉన్నారు అని చెప్తున్నారు సిబ్బంది. ప్రమాదంలో నలుగురు నదిలో కొట్టుకుపోగా, ముగ్గురు సిబ్బందిని కాపాడారని తెలుస్తుంది. ఒకరు గల్లంతు అయ్యారని చెప్తున్నారు. అయితే సరైన సమాచారం అక్కడ నుంచి రావటం లేదు. విషయం తెలుసుకున్న పోలీస్ రెవెన్యు సిబ్బంది, ప్రమాదం జరిగిన ప్రదేశం వద్దకు బయలుదేరినట్టు సమాచారం. చీకటి కావటంతో, రెస్క్యు ఆపరేషన్ కష్టంగా మారిందని తెలుస్తుంది. గల్లంతు అయిన వ్యక్తి కోసం గాలింపు జరుగుతున్నట్టు సమాచారం. గోదావరి వరదల్లో చిక్కుకున్న బాధితులకు, సరకులు ఇచ్చి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఘటనకు గల కారణాలు ఏమిటి అనే వివరాలు తెలియాల్సి ఉంది.
గోదావరిలో లాంచీ ప్రమాదం... రెండు ముక్కలు అయిన లాంచీ...
Advertisements