రాజధాని అమరావతికి సంబంధించి జనంలో ఆందోళన నెలకొందని.. వేరే ప్రభుత్వం వస్తే ఇప్పటిదాకా జరిగిన పనులు ఆగిపోతాయన్న భయం వారిలో కనిపిస్తోందని మాజీ ఎంపీ సబ్బం హరి తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం టీడీపీకే అనుకూల వాతావరణం ఉందని అభిప్రాయపడ్డారు. కొద్దిరోజుల కింద పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నిర్మాణాన్ని పరిశీలించిన వచ్చిన సబ్బం హరి.. శుక్రవారం ఏబీఎన్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. రాజధానిలో ఒక్క పని కూడా ప్రారంభం కాకుండా కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఇప్పుడు శరవేగంగా పనులు సాగడాన్ని ప్రతి ఒక్కరూ చూడాలన్నారు.

sabbam 24022019

ఈ సందర్భంగా కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్గ్యలు చేసారు. "కేసీఆర్‌ చిల్లర రాజకీయాలకే పనికొస్తారు. ఆయన సీఎం కాకూడదని చంద్రబాబు ప్రయత్నించినా అయ్యారు. ఇక్కడ కేసీఆర్‌ చేసే ప్రయత్నాల వల్ల చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారు. నెగటివ్‌ రాజకీయాలు చేసే వ్యక్తుల కంటే పాజిటివ్‌ రాజకీయాలు చేసే వ్యక్తులకు విలువ ఉంటుంది. చంద్రబాబువి పాజిటివ్‌ పాలిటిక్స్‌. మోదీని బాబు టార్గెట్‌ చేయడం వల్లే ఇక్కడి రాజకీయాలు కాస్త భిన్నంగా సాగుతున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ 270కి పైగా స్థానాలను గెలిచింది. ఈసారి 150-160 స్థానాలకు పడిపోనుంది. మన రాష్ట్రంలో బీజేపీ ఖాతా కూడా తెరవదు. కేంద్రంలో ప్రత్యామ్నాయ ఫ్రంట్‌ అధికారంలోకి వస్తే చంద్రబాబు కీలకంగా మారతారు." అని అన్నారు.

sabbam 24022019

"రాష్ట్రంలో ప్రస్తుతం వినూత్న రాజకీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాజకీయంగా టీడీపీని దెబ్బతీయడానికి కొన్ని ప్రయత్నాలు సాగుతున్నాయి. కనిపించీ, కనిపించని స్నేహితులతో కలిసి కొంతమంది టీడీపీని దించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు బలంగా ఉంటే మోదీకి కుర్చీ దక్కదన్న ఉద్దేశంతోనే కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నారు. ప్రాంతీయ పార్టీలను మట్టుబెట్టాలని మోదీ యత్నించారు. ములాయంసింగ్‌, శశికళ, లాలూ వంటి వారిపై కేసులు పెట్టారు. అటువంటి నాయకులకు చంద్రబాబు టార్చ్‌లా కనిపించారు. ఆయన ఢిల్లీ దీక్షకు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన 90 శాతం మంది పెద్ద నాయకులు రావడాన్ని బట్టే ఆయన స్థాయి ఏమిటో అర్థం చేసుకోవాలి. బీజేపీ ప్రధానిని మార్చుకుంటే తప్ప ప్రాంతీయ పార్టీలు సపోర్ట్‌ చేసే పరిస్థితి లేదు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా చంద్రబాబు కీలకం కానున్నారు." అని సబ్బం హరి అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read