సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ సబ్బం హరి, ఈ రోజు ఒక టీవీ ఛానల్ తో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు. స్థానిక ఎన్నికల ప్రక్రియ వాయిదా కాదని, మొత్తానికే రద్దు చేయాల్సింది ఉందని అన్నారు. ఎస్ఈసీ పై కులం పేరుతో జగన్ దాడి చేయడం దారుణం అని అన్నారు. రమేష్ కుమార్ పై ప్రభుత్వం వ్యవహరించిన తీరు చరిత్రలో ఎప్పుడూ జరగలేదని అన్నారు. కరోనాపై సరైన సమయంలో మోదీ నిర్ణయాలు తీసుకుని ప్రపంచదేశాల మెప్పు పొందారని అన్నారు. నాడు రమేష్ కుమార్ వాయిదా నిర్ణయం తీసుకోకపోతే.. ఇవాళ పరిస్థితి ఎలా ఉండేదో ఊహించలేం అని అన్నారు. తన ప్లాన్ పాడైపోయిందని జగన్ అక్కసు వెళ్లగక్కారని, కులం పేరుతో సీఎం దూషించడంతో ప్రజలు నివ్వెరపోయారని సబ్భం హరి అన్నారు. కరోనా నుంచి ఏపీ ప్రజల్ని రమేష్ కుమార్ కాపాడారని, జగన్ ప్రభుత్వాన్ని పక్క రాష్ట్రంలోని సలహాదారులు నడిపిస్తున్నారని, మొదట్నుంచి కరోనాను వైసీపీ ప్రభుత్వం లైట్ తీసుకుందని, పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ తో కట్టడి చేయొచ్చని భావించారని అన్నారు.

సబ్బం హరి మాట్లాడుతూ, "విపత్తులు వస్తే ఎదుర్కొనే శక్తి జగన్ కు లేదని తేలిపోయింది. కనగరాజ్ రిటైర్డ్ జడ్జియేనా అన్న అనుమానం కలుగుతోంది. కనగరాజ్ చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని భావిస్తున్నా. అధికారమందంతో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయింది. విశాఖలో కరోనా వివరాలను దాస్తున్నారని ప్రచారం. భివిష్యత్ పరిణామాలు లెక్క చేయకుండా తాను అనుకున్నదే జరగాలన్న అహంతో సీఎం ఉన్నారు. శాసనమండలి, రమేష్ కుమార్ విషయంలో అన్యాయం జరిగిందని కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. పార్లమెంటులో విపక్షాలు బిల్లులను అడ్డుకున్నా సంయమనం, విజ్ఞతతో ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారు. ముక్త కాంగ్రెస్ అమలు కోసం మోదీ అడ్డదారిలో వెళ్లలేదు. పోలవరం, అమరావతి నిర్మాణంతో ఏపీ భవిష్యత్ ఎంతో బాగుండేది. జగన్ వచ్చాక అమరావతి శ్మశానం, పోలవరం ఎడార అయ్యింది. కోర్టులో ఒకసారి ఎదురుదెబ్బ తగిలితే ప్రభుత్వం సిగ్గుపడేది కానీ.. జగన్ ప్రభుత్వం నిసిగ్గుగా అవే తప్పులు చేస్తోంది. రాష్ట్రాన్ని హైకోర్టే కాపాడుతోంది. ఫెయిర్ గా కాకుండా క్రిమినల్ మైండ్ తోనే పాలన చేస్తున్నారు. జగన్ కు అవకాశం ఇద్దామని భావించినవాళ్లంతా ఇప్పుడు బాధపడుతున్నారు."

"జమిలి ఎన్నికలు వస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుంది కానీ.. ఎన్నికలు రాకుంటే మరో నాలుగేళ్లు ఎలా ఉంటుందో ఊహించలేము. ఇంగ్లీష్ మీడియం వద్దని ఎవరూ అనలేదు. తెలుగు మీడియం కూడా కొనసాగించి ఉంటే సరిపోయేది. రమేష్ కుమార్ విషయంలో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తప్పదు. కరోనా కేసులు ఎక్కువైతే రాష్ట్రంలో వసతులు కూడా లేవు. కరోనా టెస్ట్ కిట్లను ఏజెన్సీ ద్వారా కొనుగోలు చేయాల్సిన అవసరం ఏంటి?. ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం నేరుగా దక్షిణ కొరియా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఆర్డర్ లో షరతు ఉన్నట్టుగా ధర తగ్గిస్త ఏజెన్సీకే డబ్బు వెళ్తుంది. తప్పులు బయటపడగానే ఎదురుదాడి చేయడం వైసీపీ నేతలకు అలవాటైంది. నాయకుడు ఎలా ఉంటే అనుచరులు కూడా అలానే ఉంటారు. వైసీపీ నేతలు యథేచ్చగా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. వైసీపీ నేతలు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. అధికారం లేకపోయినా చంద్రబాబు తన వంతు పని చేస్తుంటే విమర్శిస్తున్నారు. కరోనా సాయాన్ని కూడా వైసీపీ రాజకీయంగా వాడుకుంది. జరుగుతున్న తప్పులు చూస్తూ ఉన్నామన్న ఆవేదన వైసీపీ ఎమ్మెల్యేల్లో ఉంది. ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకుని జగన్ మంచి పాలన చేయాలి. కరోనా లెక్కలపై అనుమానాలున్నాయి. ప్రభుత్వం వరుసగా చేస్తున్న తప్పులు చేస్తుంటే ఎవరికైనా అనుమానం వస్తుంది. జగన్ కు ఓటేసిన మెజార్టీ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. అధికారులు పొలిటికల్ ట్రాప్ లో పడకుండా ప్రజల కోసం పనిచేయాలి. కరోనా లెక్కలపై కూడా అధికారులు అబద్దాలు చెప్పడం సరికాదు" అని మాజీ ఎంపీ సబ్బం హరి అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read