విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న పాదయాత్రలో శనివారం అపశృతి చోటు చేసుకుంది... పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన రంగారెడ్డి అనే వైసీపీ కార్యకర్త గుండెపోటుతో మృతిచెందాడు.... శనివారం ఉదయం నెల్లూరు జిల్లా ఓజిలి మండలం గుఱ్రంకొండ గామం సమీపంలో పాదయాత్ర జరుగుతుండగా రంగారెడ్డికీ గుండెపోటు వచ్చింది... ఆయనను ఆసుపత్రికి తరలించేలోగా మృతిచెందారు... మృతుడు అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని చిన్నవడుగూరు గ్రామం చెందిన వ్యక్తిగా గుర్తించారు....
జగన్ అంటే విపరీతంగా అభిమానించే రంగారెడ్డి, దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డికి వీరాభిమాని అని, జగన్ ఇక్కడకు వచ్చి పరామర్శిస్తే అతని ఆత్మకు శాంతి కలుగుతుంది అని రంగారెడ్డి సన్నిహితులు, ముఖ్య నాయకులకి చెప్పారు... జగన్ కోసం పాదయాత్ర చేస్తూ, అడుగులో అడుగు వేస్తూ, జగన్ పక్కనే ప్రాణాలు విడిచాడు అని, జగన్ వచ్చి నివాళులు అర్పిస్తే, చనిపోయిన కుటుంబానికి కూడా, జగన్ అండగా ఉన్నాడు అనే ధైర్యం వస్తుంది అని బ్రతిమిలాడారు... అయితే, అటు వైపు నుంచి ఎలాంటి సమాచారం రాకపోవటంతో, ఆగ్రహానికి లోనయ్యారు... చివరకు జగన్ వైపు నుంచి వచ్చిన సమాచరానికి, విస్తుపోయారు... పాదయత్ర జరిగే చోటుకే రంగారెడ్డి శవాన్ని తీసుకురమ్మని జగన్ కబురు పంపారు...
ఈ విషయం పై, జగన్ పై మండిపడుతున్నారు అభిమానులు... గుండెపోటుతో చనిపోయిన రంగారెడ్డిని చూసేందుకు జగన్ రాకపోవటాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు... అభిమానులు చనిపోయినా జగన్ పట్టించుకోరా అని అసంతృప్తి వ్యక్తం చేసారు.... పాదయత్ర జరిగే చోటుకే రంగారెడ్డి శవాన్ని తీసుకురమ్మన్న జగన్ అనటం ఏంటి అంటూ మండి పడుతున్నారు... ఈ పరిస్థుతుల్లో ఇలా మాట్లాడవచ్చా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు... మృతదేహాన్ని రోడ్డు పై ఉంచి జగన్ కోసం ఎదురు చూస్తున్నారు.. అయితే చీకటి పడితే, మరింత ఇబ్బంది అవుతుంది అని, ఇక ఊరు తీసుకువేల్దాం అని ఎంత చెప్పినా, వారు వినటం లేదు... మరి జగన్ వస్తారో, లేదో చూడాలి...