వైసీపీ నుంచి, సీఎం నుంచి ఏ ప్రకటన చేయాలన్నా సకలశాఖా మంత్రిగా టిడిపి పిలుచుకునే సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే బయటకొస్తారు. కుండబద్దలు కొట్టాలన్నా, కవరింగ్ చేయాలన్నా అంతా సజ్జల బాధ్యతే. మూడు పట్టభద్రుల స్థానాలలో వైసీపీ మద్దతు అభ్యర్థుల దారుణ ఓటమి, టిడిపి అద్వితీయ గెలుపుపై సజ్జల రామకృష్ణారెడ్డి మూడు రకాల వెర్షన్లు వినిపించడం వైసీపీ వాళ్లే దుమ్మెత్తి పోస్తున్నారు. జగన్ రెడ్డి ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు నంద్యాల ఉప ఎన్నికల ఫలితం వైసీపీకి వ్యతిరేకంగా వచ్చినప్పుడు..చాలా డేరింగ్‌గా కొట్టారు, కొట్టించుకున్నామంటూ..తన టైము వచ్చినప్పుడు అంతకంటే గట్టిగా కొడతామంటూ జవాబిచ్చారు. సజ్జల రామకృష్ణారెడ్డి తమ ముఖ్యమంత్రి ధైర్యంలో ఒక్క శాతమూ కూడా కనపరచకుండా కప్పదాటు ధోరణి, గుడ్డకాల్చి ఎదుట వారిపై వేసే పద్ధతితో వైసీపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు.
మూడు పట్టభద్రుల స్థానాలు ఓడిపోవడంపై..ఓట్లేసిన వాళ్లు మా ఓటర్లు కాదంటూ కొత్త లాజిక్ చెప్పడం మొదటిది. రెండోది తెలుగుదేశం పార్టీ ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేస్తుందని, ఎమ్మెల్సీ ఎన్నికలని మేనేజ్ చేసిందని చెప్పడం. ఇది మరీ కామెడీ వెర్షన్. రాజ్యాంగ వ్యవస్థలని బెదిరించి భయపెట్టి అధికారంలో ఉన్న వైసీపీ వాళ్లు టిడిపి వ్యవస్థలని మేనేజ్ చేస్తుందనడం సజ్జల దివాలాకోరు వాదనకి నిదర్శనం అంటున్నారు. ఇక మూడోది ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీ, పీడీఎఫ్‌తోనూ రహస్య ఒప్పందం చేసుకుందని సజ్జల చెప్పుకొచ్చారు. బీజేపీతో బహిరంగ ఒప్పందం వైసీపీది అని బీజేపీ నేతలే చెబుతున్నారు. ఇక సీపీఎం మధు అయితే వైసీపీ కోసం తానున్నాను అన్నట్టు వ్యవహరిస్తారు. అటు కమ్యూనిస్టులతోనూ-ఇటు బీజేపీతోనూ బహిరంగ స్నేహాలు కొనసాగిస్తూ టిడిపిపై సజ్జల చేసిన ఈ ఆరోపణా ఓటమిని ఒప్పుకోలేక వెతుక్కున్న మరో సాకు అని విమర్శలు వినిపిస్తున్నాయి.
సజ్జల మూడు సీట్ల ఓటమిపై మూడు రకాల వెర్షన్లు
Advertisements