జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు చెప్పిన మాట, పొదుపు. అది ఎక్కడ నుంచి మొదలు పెట్టారు అంటే, నేను కేవలం రూపాయి జీతం మాత్రమే తీసుకుంటాను అంటూ మొదలు పెట్టారు. తరువాత, నేను చంద్రబాబు లాగా హిమాలయ వాటర్ తాగను, కేవలం కిన్లేనే తాగుతాను అని చెప్పారు. నిజానికి చంద్రబాబు తన సొంత డబ్బులతో హిమాలయ వాటర్ తెచ్చుకునే వారు. సరే ఇది పక్కన పెడదాం. తరువాత జగన్ మోహాన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి కేవాలం 23 లక్షలే అయ్యింది అంటూ ప్రచారం చేసారు. నిజానికి, ఆ 23 లక్షలు అడ్వాన్స్ అని జీఓలో ఉంది. తరువాత ఎంత ఇచ్చారో, ఆ దేవుడికే తెలియాలి. అయితే ఇవన్నీ ప్రచారం చేస్తూ, నేను పొదుపు చేస్తాను, చంద్రబాబు దుబారా చేశారు అనే ప్రచారం బాగా చేసారు.
అయితే వాస్తవంలో మాత్రం, జగన్ గారి పొదుపు ఎక్కడా కనిపించటం లేదు. తన కాన్వాయ్ కోసం దాదపుగా 5 నుంచి 8 కోట్లు ఖర్చు చేసారు. జగన్ మోహన్ రెడ్డి వాడే కారు విలువే కోటికి పైగా ఉంటుంది. మరి ఇది పొదుపు ఎలా అవుతుంది ? తన వ్యక్తిగత పర్యటన నిమిత్తం జేరెసులాం వెళ్లారు, నా సొంత ఖర్చులు అని చెప్పి, సెక్యూరిటీ ఖర్చుల పేరుతొ 23 లక్షలు తీసుకున్నారు. ఇది పొదుపు అంటారా ? సరే సియం సెక్యూరిటీ అనుకుందాం. మరి ప్రభుత్వంలో ఉన్న చీఫ్ విప్ ల కోసం, వారికి అద్దె నిమిత్తం అని చెప్పి, ఒక్కొక్కరికి లక్ష రూపాయిలు నెలకు అద్దె ఇస్తున్నారు. నిజానికి విజయవాడ, గుంటూరులో ఎంత పెద్ద ఇల్లు అయినా, 30 వేలకు మించి అద్దె ఉండదు. దీనికి ఎలా సమాధానం చెప్తారు ? ఇక తాజాగా విడుదల అయిన జీఓ చూస్తూ, మైండ్ పోతుంది.
సాక్షి టీవీలో పని చేసే వారిని, ప్రభుత్వంలోకి తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగా, జగన్ బంధువు అయిన సజ్జల రామక్రిష్ణారెడ్డి సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ గా ఉండేవారు. ఇప్పుడు ఆయనకు, ప్రభుత్వంలో, ప్రజాసంబంధాల సలహాదారుడిగా నియమించారు. అయితే ఆయన కోసం విడుదల చేసిన జీఓలో, ఆయన జీతం కేవలం 14 వేలు మాత్రమే ఉంది. కాని ఆయనకు ఇచ్చే అలవెన్స్ లు అన్నీ కలుపుకుంటే, దాదపుగా నెలకు 2 లక్షలు పైగా అవుతుంది. ఇక ఆయనకు సిబ్బందిని ఇచ్చారు, వారి జీతాలు కూడా కలుపుకుంటే, నెలకు 10లక్షలు దాటిపోతుంది. ఇక మరొక సాక్షి ఉద్యోగిని, కమ్యూనికేషన్ సలహాదారుడిగా జీవీడీ క్రిష్ణమోహన్ ని నియమించారు. ఈయన సాక్షిలో బ్యూరో చీఫ్ స్థాయిలో పనిచేసేవారు. ఈయనకు కూడా ఇలాగే, జీతం తక్కువ, అలవెన్స్ లు పేరుతో దోపిడీ. మళ్ళీ వీరికి కారు కొనుక్కోమని 10 లక్షలు ఇచ్చారు. కాఫీ కప్పులు కొనుక్కోమని, 1.50 ఇచ్చారు. మరి ఇంత చేస్తూ, జగన్ మోహన్ రెడ్డి గారు, పొదుపు అంటే ఎలా ? నిజానికి ఈ సలహాదారులు పోస్ట్ లు జగన్ గారు వద్దు అనుకోవచ్చు, వీటి వల్ల ప్రజలకు పెద్దగా ప్రయోజనం కూడా ఉండదు. చూద్దాం, ఇంకా ఎంత మంది సలహాదారులు వస్తారో, వారికి ఎంత జీతాలు, మనం కట్టే పన్నుల నుంచి ఇవ్వాలో.