ఆంధ్రప్రదేశ్ సలహాదారుతో పాటు, అన్ని శాఖలు తానై స్పందించి, సకల శాఖా మంత్రిగా పేరు తెచ్చుకున్న సజ్జల, గత రెండు రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు, పడుతున్న ఖంగారు చూస్తుంటే, ఏదో పెద్ద ఇబ్బంది రాబోతున్నట్టు అర్ధం అవుతుంది. వివేక కేసులో, అవినాష్ రెడ్డి పేరు చేర్చి సిబిఐ వేసిన చార్జ్ షీట్, రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఆ రోజు ఏ తప్పు చేయకపోయినా, రాజకీయ లబ్ది కోసం, నారాసుర చరిత్ర అంటూ, చంద్రబాబు ఫోటో వేసి, ఆయన చేతిలో కత్తి పెట్టి, వైసీపీ చిమ్మిన విషం అంతా ఇంతా కాదు. ఆ రోజు చంద్రబాబు కాబట్టి ఊరుకున్నారు కానీ, మరే ముఖ్యమంత్రి అయినా అయ్యి ఉంటే, ఆ పత్రికా కార్యాలయం నామరూపాలు లేకుండా అయ్యేది. అయితే చంద్రబాబు తొందరపడరు, సమయం కోసం ఎదురు చూసి, రాజకీయంగా దెబ్బ కొడతారు. సరిగ్గా అదే జరిగింది. నిజం నిలకడ మీద బయటకు వస్తుంది. అందులో భాగంగానే చార్జ్ షీట్ లో అవినాష్ రెడ్డి పేరు రావటంతో, తెలుగుదేశం పార్టీ ఫుల్ ఫ్లో లో ఎదురు దా-డి మొదలు పెట్టింది. సిబిఐ ఆధారలు ఇవ్వటం, గతంలో వచ్చిన పుకార్లు నిజం అని నమ్మేలా వార్తలు వస్తూ ఉండటం, తెలుగుదేశం పార్టీ ప్రచారం, ఇవన్నీ వైసీపీని ఉక్కరి బిక్కిరి చేస్తున్నాయి. దీంతో వారికి ఏమి చేయాలో, అర్ధం కాని పరిస్థితి.
అందుకే డైరెక్ట్ గా వైసీపీ ట్రబుల్ షూటర్ సజ్జల రంగంలోకి దిగారు. గత రెండు ప్రెస్ మీట్లు మొత్తం వివేక కేసు గురించి వివరణ ఇవ్వటంతోనే సరిపోయింది. సజ్జల ఇలా ఎందుకు చేస్తున్నారో అనే అనుమానం కూడా వస్తుంది. టిడిపి చేస్తున్న ప్రచారం ఏ స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళక పొతే సజ్జల ఇలా వస్తారో అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపధ్యంలోనే, సజ్జల చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. చంద్రబాబుని ఉద్దేశిస్తూ, గతంలో బాలక్రిష్ణ ఇంట్లో కాల్పులు జరిగితే, రాజశేఖర్ రెడ్డి ఎలా గొప్ప మనసుతో వ్యవహరించారో చంద్రబాబు ఆలోచించాలి అనే మాటలకు అందరూ షాక్ తిన్నారు. ఒక విధంగా చంద్రబాబు, ఈ విషయం వదిలేయి అనే విధంగా సజ్జల వేడుకుంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. అప్పట్లో వైఎస్ చూసి చూడనట్టుగా వదిలేసారని చెప్తున్నారు అంటే, చంద్రబాబుని కూడా అలాగే వదిలేయమని చెప్తున్నారు. అయితే, నిన్నటి వరకు చంద్రబాబు చేపించాడు అని చెప్పి, ఇప్పుడు సిబిఐ ఆధారాలు బయట పెడుతుంటే మాత్రం, చంద్రబాబు చూసి చూడనట్టు ఎలా వదిలేస్తాడో వైసిపీ ఆలోచించుకోవాలి.