ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మొత్తం తానై వ్యవహరిస్తున్న ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి పై విమర్శలు ఎదురు అవుతున్నాయి. ఏ శాఖ వ్యవహారం అయినా, ఆయనే వచ్చి మీడియాతో మాట్లాడటం, ఇప్పుడు చివరకు ఏకంగా ఉద్యోగులను కూడా ఆయన కలిసి హామీలు ఇవ్వటం పై, అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలో ఏమి జరుగుతుందో చెప్పటానికి, ఇదే ఉదాహరణ అని అంటున్నారు. ఉద్యోగులు ఎదుర్కుంటున్న సమస్యల పై ఉద్యోగులు ప్రభుత్వంతో చర్చలు అంటూ సజ్జలను కలవటం పై టిడిపి అభ్యంతరం చెప్తుంది. అశోక్ బాబు మాట్లాడుతూ" పీఆర్సీ పై వచ్చే నెలాఖరులోగా నిర్ణయం తీసుకుంటామన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల దానిపైఏమీ తేల్చలేదు. సజ్జల చెప్పిందే ప్రభుత్వహామీ అని ఎవరూ అనుకోవడం లేదు. ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రో, ప్రభుత్వప్రధాన కార్యదర్శో స్పందించాలి, సలహాదారులు కాదు. ఉద్యోగ సంఘాలు కలయిక త్రివేణి సంగమం కాదు. దాని వల్ల ఉద్యోగులకు బంగారు భవిష్యత్ వచ్చినట్లు కాదు. పీఆర్సీ నివేదిక కూడా తీసుకోలేని స్థితిలో ఉన్న ఉద్యోగ సంఘాలు, సజ్జల చెప్పారంటూ సన్నాయినొక్కులునొక్కడం సరికాదు. పీఆర్సీ సకాలంలో అమలుకానందున ఉద్యోగులు ఎంత నష్టపోయారో ఉద్యోగ సంఘాలకు తెలియదా? ఏడుకొండల వాడి దర్శనం కంటే గొప్పగా ముఖ్యమంత్రి దర్శనం అయిందని సంబరపడితే సరిపోతుందా?"

sajjala 16102021 2

"వారంలో సీపీఎస్ రద్దన్న మఖ్యమంత్రి హామీకి రెండున్నరేళ్లు పూర్తయ్యాయి. ప్రభుత్వ పోకడను బట్టి ఉద్యోగసంఘాల నిర్ణయాలుండాలి. ఏ డిమాండ్లు ఎక్కడ, ఎలా సాధించాలనే దానిపై ఉద్యోగ సంఘాలకు స్పష్టత లేదు. పటిష్టమైన పోరాట పంథాను సంఘాలు నిర్ణయించుకోలేక పోవడం వాటి వైఫల్యమే. కింది స్థాయి ఉద్యోగుల సంఘాల తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. రాష్ట్రంలోని ఉద్యోగులు, పింఛన్ దారులు, ఉపాధ్యాయులందరి పక్షాన ఉద్యోగ సంఘాలు మాట్లాడాలి. గతంలో ప్రాణాలైనా అర్పిస్తామన్న ఉద్యోగ సంఘాలు నేడు ఛలో అసెంబ్లీ కూడా నిర్వహించలేని స్థితిలో ఉన్నాయి. ఉద్యోగ సంఘాలనేతలు నోరెత్తితే ఏమవుతుంది.. మహా అయితే ఉద్యోగాల్లోంచి తీసేస్తారు. దానికే భయపడతారా? ప్రభుత్వాలు మారగానే తిరిగి ఎవరి ఉద్యోగాలువారికి వస్తాయికదా..అది జరిగిన చరిత్ర కదా. అది ఉద్యోగ సంఘాల నేతలకు తెలియకపోవడం మా దురదృష్టం. ఒకవేళ తెలిసీ సంఘాలనేతలు మౌనంగా ఉంటే, అది కూడా ఉద్యోగుల దురదృష్టమే. 11వపీఆర్సీ ఎప్పటి నుంచి అమలవుతుందన్న దానిపై ప్రభుత్వం నుంచి ప్రకటనే లేదు. పలానా తేదీనుంచి తమకు ఎరియర్స్ కావాలని ఉద్యోగ సంఘాలనేతలు ఎందుకుపట్టుబట్టడం లేదు? ప్రభుత్వానికి గులామ్ అనే నాయకులను నమ్ముకోవడానికి ఉద్యోగులు సిద్ధంగా లేరు. ఉద్యోగులను నష్టపెడితే, దానిఫలితం వచ్చేఎన్నికల్లో కచ్చితంగా ఉంటుందని ప్రభుత్వం గ్రహిస్తే మంచిది. ఈ నిజమే ఉద్యోగసంఘాలనేతలకూ వర్తిస్తుంది." అని అశోక్ బాబు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read