ఈ దొంగ సాక్షి, దొంగ రాతలు గురించి చెప్పీ చెప్పీ మాకు విసుగు వస్తుంది... కాని, ప్రజలు నిజం అని నమ్మే అవకాసం ఉంది కాబట్టి, వీరి దొంగ రాతలను ప్రజలకు తెలిసేలా చేసి, ఇలాంటి వారిని ఎండగట్టటం కోసం తప్పటంలేదు... రోజుకి ఒక తప్పుడు కధనం రాయటం, దానికి ఒక క్రియేటివ్ స్టొరీ అల్లటం, చంద్రబాబు టెక్నాలజీ వాడి ఆ దొంగ రాతలని పట్టుకోవటం... జగన్ పాదయత్ర మొదలైన దగ్గర నుంచి ఇదే సీన్... ఎన్ని సార్లు దొరికినా, ఎన్ని సార్లు మీవి తప్పుడు రాతలు అని చెప్పినా, సాక్షి మాత్రం అన్నీ వదిలేసి, అవే తప్పుడు కధనాలు రాస్తుంది...
నిన్న ఒక అద్భుతమైన స్టొరీ అల్లింది... సినిమాల్లో సెంటిమెంట్ స్టొరీ లాగా, సీన్ బాగా పండింది... తీరా చూస్తే, ఎప్పటిలాగే దొరికిపోయారు... విషయంలోకి వెళ్తే, "ఆదుకునేవారే లేరప్ప!" అంటూ ఒక వికలాంగుడికి పెన్షన్ రావటం లేదు అని కధ సారంశం... ఇవన్నీ 1980 ఐడియాలు... ఇప్పుడు మనం చంద్రబాబు రియల్ టైం గవర్నెన్స్ కాలంలో ఉన్నాం... దొంగ ఇట్టే దొరుకుతాడు... అలా ఇలా కాదు, ఏ టైంలో, ఎక్కడ పెన్షన్ తీసుకుంది డీటెయిల్స్ అన్నీ రియల్ టైంలో బయటపడి పోతాయి.... సాక్షి దొంగ రాతలని పట్టుకున్నాకా, "ఆంధ్రప్రదేశ్ పెద్ద కొడుకు, చంద్రబాబు ఆదుకున్నారప్పా" అని హెడ్డింగ్ రాయాలి..
చిత్తూర్ జిల్లా, తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ఓబీ నాయక్ తాండాకు చెందిన బాలనాగమ్మ, జగన్ ను కలిసి నా భర్త అశోక్ నాయక్ కు జబ్బు చేసి చేతులు కాళ్ళు పడిపోయాయి అని, ప్రభుత్వం పెన్షన్ ఇవ్వట్లేదు అని, రేషన్ ఇవ్వటంలేదు అని చెప్పినట్టు సాక్షి కధనం అల్లింది... తీరా రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ లో వివరాలు చూస్తే, జనవరి 2017 నుంచి ప్రతి నెలా 1500 పెన్షన్ తీసుకుంటున్నాడు (Pension ID : 110803761)... ప్రతి నెలా రేషన్ తీసుకుంటున్నారు... డిసెంబర్ నెలలో, డిసెంబర్ 5, సాయంత్రం 6 గంటల 34 నిమషాల 59 సెకండ్లకు రేషన్ తీసుకున్నట్టు, రాగులు 3కేజీలు, 35 కిలోల బియ్యం తీసుకున్నట్టు డ్యాష్ బోర్డు చూపించింది... దీంతో సాక్షి రాతలని, రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ మరోసారి పట్టేసింది...