జగన్ మోహన్ రెడ్డికి చెందిన సాక్షి టీవీ ఛానల్ ప్రస్తుతం స్టే మీద నడుస్తున్న విషయం తెలిసిందే. సాక్షి ఛానల్ ని మూసేయాలని కేంద్రం ఎప్పుడో ఆదేసించినా, జగన్ మోహన్ రెడ్డి స్టే తెచ్చుకుని సాక్షి టీవీ నడుపుతున్నారు. ఇప్పటికే సాక్షి పుట్టుక పైనే సిబిఐ కేసులు, అవినీతి కేసులు, దొంగ పెట్టుబడులు తెచ్చారని ఆరోపణలు ఉన్నాయి. కొన్ని అస్తలు సిబిఐ, ఈదీ అటాచ్ చేసాయి కూడా. అయితే ఇదంతా ఒక పక్క జరుగుతూ ఉండగానే, అసలు సాక్షి టీవీ అనే దానికి అనుమతులే లేవని రద్దు చేసేస్తున్నాం అంటూ కేంద్రం సంచలన ఆదేశాలు ఇచ్చింది. దీంతో హుటాహుటిన జగన్ మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్లి, స్టే తెచ్చుకున్నారు. ప్రస్తుతం సాక్షి స్టే మీద నడుస్తుంది. అయితే ఇప్పుడు ఇదే విషయం పై కేంద్రం మరో సంచలన ప్రకటన చేసింది. అసలు సాక్షి టీవీ ఛానెల్ అనుమతిని రద్దు చేసింది నిజమా కాదా ? లేకపోతే వ్యతిరేక వర్గం ప్రచారం చేస్తుందా అనే విషయం తేల్చుకోవటానికి, కేంద్రాన్ని సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద ఒక వ్యక్తి, కేంద్ర సమాచార ప్రసార శాఖను ఒక ప్రశ్న అడిగారు. జగన్ మోహన్ రెడ్డికి చెందిన సాక్షి టీవీ ఛానల్ రద్దు చేసిన మాట వాస్తవమేనా ? అంటూ కేంద్ర సమాచార శాఖను, సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) ప్రశ్న అడగటంతో వారు సమాధానం ఇచ్చారు.

sakshi 30032022 2

కేంద్ర సమాచార ప్రసార శాఖకు చెందిన అండర్‌ సెక్రటరీ విజయ్‌ కౌశిక్‌ ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. సాక్షి టీవీ అనుమతులు రద్దు చేసిన మాట నిజమే అని ఆయన తెలిపారు. దానికి సంబంధించి, తమ శాఖకు చెందిన అండర్‌ సెక్రటరీ సోనియా ఖట్టర్‌ జారీచేసిన ఉత్తర్వు ప్రతిని కూడా ఆయన పంపించారు. సాక్షి టీవీ పేరుతో వార్త ఛానల్ ప్రసారాల కోసం, ఇందిరా టెలివిజన్‌ లిమిటెడ్‌కు 2006 జూలై 7న, పదేళ్ళ పాటు తాము అనుమతి ఇచ్చామని చెప్పారు. అయితే పదేళ్ళ తరువాత మాత్రం, ఆ అనుమతులు పొడిగించలేదని అన్నారు. సాక్షి ఛానల్ పై పలు అభ్యంతరాలు ఉండటంతో, భద్రతాపరమైన అనుమతులు మంజూరు చేసేందుకు కేంద్ర హోం శాఖ ఒప్పుకోలేదని తెలిపారు. మీ ఛానల్ ను ఎందుకు తొలగించకూడదో చెప్పాలని సాక్షిని కోరగా వారు సమాధానం ఇచ్చారని, అయితే ఆ వివరణ తమకు సంతృప్తి ఇవ్వలేదని, అందుకే రద్దు చేసి పడేసాం అని చెప్పారు. ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి హైకోర్టుకు వెళ్లి, సాక్షి రద్దు పై స్టే తెచ్చుకుని నడిపిస్తున్నారు. మరి హైకోర్టు ఎప్పటి వరకు స్టే ఇస్తుందో చూడాలి మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read