జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులు సంపాదించారు అని, తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని లక్షల కోట్లు సంపాదించారు అంటూ, సిబిఐ ప్రాధమిక దర్యాప్తు చేసి, జగన్ పైన కేసులు పెట్టిన విషయం తెలిసిందే. తరువాత పూర్తి స్థాయి విచారణ చేసి, జగన్ చేసిన అవినీతికి దిమ్మ తిరిగిన సిబిఐ, ఈడీని కూడా రంగంలోకి దించింది. మొత్తం జగన్ మోహన్ రెడ్డి పైన, 11 సిబిఐ కేసులు, 5 ఈడీ కేసులు నమోదు అయ్యాయి. అయితే ఈ కేసులు పై జగన్ మోహన్ రెడ్డి జైలుకు కూడా వెళ్లారు. ప్రస్తుతం ఆయన కండీషనల్ బెయిల్ పైన బయట ఉన్నారు. అయితే 2012 నుంచి ఈ కేసుల విచారణ ఇంకా ట్రైల్స్ కు రాలేదు అంటే ఆశ్చర్య పోక తప్పదు. ఇప్పటికీ ఈ కేసులో, ఆ పిటీషన్ అని, ఈ పిటీషన్ అని, సాగదీస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కోర్టులో ఈ కేసుల పై విచారణ మొదలు కాలేదు. అయితే ఇదే విషయం పైన నాంపల్లిలో ఉన్న సిబిఐ స్పెషల్ కోర్టు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్ మోహన్ రెడ్డి కేసుల్లో, సాక్షి కేసు పైన కోర్టు, ఈడీ పైన ఆగ్రహం వక్తం చేసింది. కేసు విచారణ ఆలస్యం కావటానికి ఇందిరా టెలివిజన్ కావాలని కోర్టులో డిశ్చార్ పిటీషన్లు వేస్తూ, కేసులు ఆలస్యం అయ్యేలా చేస్తూ ఉండటంతో, కోర్టు ఇన్నాళ్ళు భరిస్తూ వచ్చింది. అయితే ఇలాంటి పిటీషన్లు వెంటనే కోర్టు కొట్టేస్తుందని, విచారణ సంస్థలు కౌంటర్ దాఖలు చేస్తే చాలు అని లీగల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయ పడుతున్నారు.

court 15042022 2

అనూహ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ , తెలిసో తెలియకో కానీ, ఈ కేసుల్లో కౌంటర్ దాఖలు చేయటానికి సమయం తీసుకుంటున్నారు. ఈ కేసులో ఇంకో ఆశ్చర్యమైన విషయం ఏమిటి అంటే, ఇందిరా టెలివిజన్, గత ఏడాదిలో డిశ్చార్జ్ పిటీషన్ దాఖలు చేసారు. అయితే అనూహ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటి వరకు ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయలేదు. దీంతో మొన్న జరిగిన విచారణ సందర్భంగా, సిబిఐ స్పెషల్ కోర్ట్ ప్రిన్సిపల్ జడ్జి మధుసుధన రావు సీరియస్ అయ్యారు. ఈడీకి చివరి చాన్స్ ఇచ్చారు. అసలు ఈడీ ఇబ్బంది ఏమిటో అర్ధం కావటం లేదు అంటూ అసహనం వ్యక్తం చేస్తూ, ఇదే లాస్ట్ చాన్స్ అని, ఈ కేసుని ఈ నెల 21కి వాయిదా వేస్తున్నాం అని, ఆ లోపు కౌంటర్ దాఖలు చేయాలని, కౌంటర్ దాఖలు చేయని పక్షంలో, తాము ఒక నిర్ణయం తీసుకుంటాం అంటూ కోర్ట్ పేర్కొంది. జగన్ మోహన్ రెడ్డికి చెందిన ఈ 16 కేసుల్లో , అనేక డిశ్చార్జ్ పిటీషన్లు దాఖలు అయ్యాయి. ఈ పిటీషన్లు క్లియర్ అయితే కానీ, అసలు కేసు విచారణకు రాని పరిస్థితి ఉండటంతో, ఇలా పిటీషన్లు వేసి, కేసుని సాగదీస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read