ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత మూడు నెలల నుంచి, అటు జీతాలు కానీ, ఇటు పెన్షన్లు కానీ లేట్ అవుతూ వస్తున్నాయి. ఒకసారి వైఎస్ఆర్ పుట్టిన రోజు అని చెప్పి, 8వ తేదీ దాకా పెన్షన్లు ఇవ్వలేదు. అయితే కేవలం పెన్షన్లు మీద బ్రతికే ముసలి వారు మాత్రం, ఫస్ట్ తారీఖు పెన్షన్లు వస్తాయని ఆశతో, ఎన్నో ఖర్చులు ఉండటంతో ఇబ్బందులు పడ్డారు. ఇక మొన్నటి నెల కూడా దాదపుగా 10 వ తేదీ దాటిన తరువాత కూడా పెన్షన్లు ఇస్తూనే ఉన్నారు. ఇక పోయిన నెలలో, ఉద్యోగులకు జీతాలు ఫస్ట్ తారీఖున పడలేదు. రెండు రోజులు ఆలస్యంగా పడ్డాయి. అయితే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని, అందుకే పడలేదని ప్రచారం జరగగా, వెంటనే ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. సాఫ్ట్ వేర్ లో సమస్య ఉందని, అందుకే ఇలా అయ్యిందని, అంతే తప్ప ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక కాదని క్లారిటీ ఇచ్చింది.
పోయిన నెల జీతాలు రెండు రోజులు ఆలస్యంగా పడ్డాయి. అయితే ఈ నెల జీతాలు కూడా మూడో తారిఖు తరువాతే పడననున్నాయి. జీతాలు మాత్రమే కాదు, పెన్షన్లు కూడా మూడో తారీఖు తరువాతే పడనున్నాయి. ఈ మేరకు ఏపీ ఆర్థిక శాఖ ఓక ప్రకటనలో తెలిపింది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పింఛన్లను ఒకటో తేదీనే రాష్ట్ర ఆర్థిక శాఖ విడుదల చేస్తుంది. అయితే, ఈ సారి ఒకటో తేదీ ఆదివారం కావటంతో , రెండో తేదీ అయిన సోమవారం వినాయక చవితి సెలవు కావడంతో, మూడో తారీఖున జీతాలు, పెన్షన్లు వెయ్యనున్నారు. దీంతో మూడో తేదీన జీతాలు బ్యాంకులో జమకానున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే గతంలో చంద్రబాబు ఉండగా, ఇలా సెలవులు ఉంటే, ముందే జీతం వేసేవారు.
ముఖ్యంగా పండుగ ఉన్న టైంలో, ఉదోగ్యులు దగ్గర, పెన్షన్ తీసుకునే వారి దగ్గర డబ్బులు ఉంటే, పండుగ బాగా జరుపుకుంటారని, ముందుగానే జీతాలు వేసే వారు. అయితే, ఇప్పుడు పరిస్థితి మారింది. వినాయక చవితి పండుగకు, డబ్బులు లేకుండా ఉద్యోగులు, అటు పెన్షన్ లు తీసుకునే వారు ఉన్నారు. ఉసూరు మంటూ ప్రభుత్వం ఎప్పుడు డబ్బులు వేస్తుందా అని చూస్తున్నారు. చంద్రబాబు ఉన్న సమయంలో 2017 నాటి సంఘటనను ఉద్యోగులు గుర్తు చేసుకుంటున్నారు. 2017లో నెలాఖరులో దసరా పండగ రావడం, 28 నుంచి అక్టోబర్ 2 తేది వరకూ బ్యాంకులకు వరుసగా సెలవులు ఉండడంతో అప్పటి ప్రభుత్వం ముందుగానే జీతాలు వేసిన సంగతి గుర్తు చేసుకుంటున్నారు.