ఆడపడుచులకు పూర్తిగా ‘పసుపు-కుంకుమ’లు అందాయి. రాష్ట్రంలోని సుమారు కోటి మంది డ్వాక్రా మహిళలకు చెందిన గ్రూపుల ఖాతాల్లో గురువారం డబ్బు జమ అయింది. దీంతో మహిళల్లో సంబరాల వాతావరణం నెలకొంది. కేవలం డబ్బులు ఇవ్వడమే కాకుండా, తమ ‘పసుపు-కుంకుమలు’ చల్లగా ఉండాలని పెద్దన్నలా ఆలోచించి, ఆదరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల వారంతా తమ అభిమానం చాటుకొనేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పథకం కింద ప్రకటించిన రూ. పది వేలలో ఇప్పటికే రూ.2500 ఒక విడత, రూ.3500 మరో విడత డ్వాక్రా మహిళకు అందాయి. మిగతా రూ.4 వేలును, ఆమె గ్రూపు ఖాతాలో గురువారం జమ చేశారు. శుక్ర, శని, ఆదివారాలు బ్యాంకులకు సెలవులు కావడంతో పొదుపు గ్రూపు మహిళలు ఎనిమిదో తేదీ నుంచి చెక్కులు బ్యాంకుల్లో వేసి డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఈ నెల 5న చెల్లే విధంగా పోస్టు డేటెడ్‌ చెక్కులను ప్రభుత్వం ఇప్పటికే పంపిణీ చేసింది.

game 27032019

దీనిపై ప్రతిపక్షనేతలు చేసిన ఫిర్యాదులను తోసిపుచ్చి... పసుపు-కుంకుమ పథకం ఇప్పటికే ప్రారంభమైనందున కొనసాగించవచ్చని ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేయడంతో, ఈ పథకం అమలులోని చివరి అడ్డంకీ తొలగిపోయింది. గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో సుమారు 3.94 కోట్ల మంది ఓటర్లుండగా.. అందులో సగానికిపైగా మహిళలే. పురుషుల కంటే సుమారు నాలుగు లక్షల ఓట్లు మహిళలవే ఎక్కువున్నాయి. ఈ మహిళల్లో అత్యధిక శాతం తమ సాధికారతకు బీజం పడింది 1995-96లో చంద్రబాబు హయాంలోనేనని గుర్తుచేసుకుంటున్నారు. డ్వాక్రా గ్రూపుల ఆవిర్భావం జరిగింది అప్పుడే. సాధారణంగా మహిళలు ఎంతో కొంత పొదుపు చేసి.. అత్యవసర సమయాల్లో భర్తకు ఇస్తూ సాయపడుతుంటారు. లేకుంటే పిల్లల ఖర్చులకు ఇస్తుంటారు. అలా వారిలో ఉన్న పొదుపు గుణాన్ని గ్రహించిన చంద్రబాబు.. దాన్ని తారకమంత్రం చేశారు. పొదుపు సంఘాలను ఏర్పాటుచేశారు. ఈసారి ఐదేళ్లలో మరింత ముందుకెళ్లి మహిళలకు ‘పసుపు-కుంకుమ’ను రెండు దఫాలుగా ఇచ్చారు. ఒక్కో దఫా రూ.10వేల చొప్పున మొత్తం రూ.20 వేలు ఇచ్చారు. ఇది మహిళలను ఆర్థికంగా సాధికారం చేసేందుకు ఎంతగానో ఉపకరించింది.

game 27032019

జిల్లాల వారీగా పసుపు-కుంకుమ లబ్ధి... అనంతపురం రూ.681.33 కోట్లు, చిత్తూరు రూ.736.53 కోట్లు, తూర్పుగోదావరి రూ.1038.71 కోట్లు, గుంటూరు రూ.770.08 కోట్లు, విశాఖపట్నం మహానగర పాలక సంస్థ రూ.200.98 కోట్లు, కడప రూ.441.53 కోట్లు, కృష్ణా రూ.672.57 కోట్లు, కర్నూలు రూ.614.39 కోట్లు, నెల్లూరు రూ.448.67 కోట్లు, ప్రకాశం రూ.582.72 కోట్లు, శ్రీకాకుళం రూ.555.15 కోట్లు, విశాఖపట్నం రూ.526.12 కోట్లు, విజయనగరం రూ.492.60 కోట్లు, విజయవాడ నగరపాలక సంస్థ రూ.99.23 కోట్లు, పశ్చిమగోదావరి రూ.740.69 కోట్లు. పొదుపు సంఘాలు.. 8,40, 000.. మొత్తం సభ్యులు.. సుమారు 94 లక్షలమంది...వీరిలో వెనుకబడిన వర్గాల మహిళలు.. 43,49,056.. షెడ్యూల్‌ కులాలకు చెందినవారు.. 17,16,562.. షెడ్యూల్డ్‌ తెగలకు చెందినవారు.. 4,32,063... మైనారిటీ మహిళలు.. 3,42,761

Advertisements

Advertisements

Latest Articles

Most Read