రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌, సియాటిల్‌లో శాంసంగ్‌ చీఫ్‌ డిజిటల్‌ ఆఫీసర్‌ కాల్‌రామన్‌ ని కలిసారు... ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో, రాష్ట్రంలో శాంసంగ్‌ గ్లోబల్‌ ఈ-కామర్స్‌ కేంద్రాన్ని ఏర్పాటు చెయ్యటానికి ముందుకొచ్చింది... పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఈ దిశగా సాధించిన పురోగతిని లోకేశ్‌ వివరించారు. శాంసంగ్‌ గ్లోబల్‌ ఈ-కామర్స్‌ సెంటర్‌ను మీ రాష్ట్రంలో ఏర్పాటుచేస్తాం. స్వచ్ఛందంగా నేను పేద విద్యార్థుల చదువుకు సాయం చేస్తున్నాను. ఏపీలో ఒక స్కూల్‌ నిర్మిస్తాను. వెయ్యిమంది పేద విద్యార్థుల్ని దత్తత తీసుకుంటాను’ అని ప్రకటించారు.

samsung 03022018 2

ఇదే సందర్భంలో, కాల్‌రామన్‌ స్పందిస్తూ... ‘నేను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి పెద్ద అభిమానిని. చంద్రబాబు ఆలోచనల్ని, ఆయన విజన్‌ని బలంగా నమ్ముతాను. నేను అమెజాన్‌లో పనిచేస్తున్నప్పుడు హైదరాబాద్‌లో ఆ కంపెనీ ఏర్పాటుకు మూడురోజుల్లోనే అనుమతులిచ్చారు. ఇప్పుడక్కడ 30వేల ఉద్యోగాలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌కు అన్నిరకాలుగా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నాను. మీరు మాటిస్తే దానికి కట్టుబడి ఉంటారనే నమ్మకం ఉంది. శాంసంగ్‌ వివిధ రంగాల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం." అని అన్నారు...

samsung 03022018 3

మరోవైపు బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ అగ్రికల్చర్‌ డెవల్‌పమెంట్‌ డైరక్టర్‌ నిక్‌ ఆస్టిన్‌, ఇతర ప్రతినిధులతోనూ లోకేశ్‌ సమావేశమై డిజిటల్‌ వ్యవసాయంపై చర్చించారు. గ్రామీణాభివృద్ది, వ్యవసాయం, విద్య, వైద్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని లోకేశ్‌ కోరారు. చిన్నారులలో పోషకాహార లేమితో వచ్చే ఆరోగ్య సమస్యలను పరిష్కరించేలా రైస్‌ పోర్టిఫికేషన్‌లో సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. గేట్స్‌ ప్రతినిధులు అందుకు సానుకూలత వ్యక్తం చేశారు. అమెజాన్‌ గ్లోబల్‌ పబ్లిక్‌ పాలీ ఉపాధ్యక్షుడు మైకేల్‌ పంక్‌తో కూడా లోకేశ్‌ సమావేశమయ్యారు. ఏపీలో క్లౌడ్‌ సెంటర్ల ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. అమెజాన్‌ను ఇండియాలో విస్తరించే ఆలోచన ఉంటే తమ రాష్ట్రంలో ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి మైకేల్‌ స్పందిస్తూ.. భారత్‌లో ఉన్న తమ బృందాన్ని ఆంధ్రప్రదేశ్‌కు పంపిస్తామన్నారు. వాషింగ్టన్‌ స్టేట్‌ ఇండియా ట్రేడ్‌ రిలేషన్స్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ బిజినెస్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలోనూ పాల్గొన్న లోకేశ్‌... ఆ ప్రతినిధులను రాష్ర్టానికి ఆహ్వానించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read