గజపతి రాజుల కుటుంబం అంటే, విజయనగరం జిల్లాలోనే కాదు, రాష్ట్రం మొత్తం, ఇంకా చెప్పాలి అంటే దేశంలోనే పేరు ఉంది. ఆ రాజ కుటుంబం చేసిన సేవలు అన్నీ ఇన్నీ కావు. ఒకానొక సమయంలో సాక్షాత్తు ఇందిరా గాంధినే, గజపతి రాజుల ముందు గౌరవంగా తల వంచి నమస్కారం చేసారు అంటే, ఆ కుటుంబం చేసిన సేవలు ఎంతటి ప్రభావం చూపాయో చెప్పుకోవచ్చు. రెండో తరం అయిన ఆనందగజపతి, అశోక్ గజపతి రాజులు, ఆ కుటుంబ గౌరవాన్ని కొనసాగించేలా పనులు చేసారు. అశోక్ గజపతి రాజు గారు, కేంద్రం మంత్రి అయినా సరే, ఆయన సింప్లిసిటీకి, ప్రత్యర్ధులు కూడా ఫిదా అవుతారు. ఆ కుటుంబం నడిపే మాన్సాస్ ట్రస్ట్ సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే. అలంటి కుటుంబలో రాజకీయంగా కొంత మంది చిచ్చు పెట్టారు. మాన్సాస్ చైర్మెన్ గా ఉన్న అశోక్ గజపతి రాజుని రాత్రికి రాత్రి తప్పించి, సంచయితకు బాధ్యతలు అప్పగించారు. దీని వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పాత్ర ఉందనేది బహిరంగ రహస్యమే. ఇకపోతే అప్పటి నుంచి విబేధాలు బహిరంగంగానే కొనసాగుతున్నాయి. తాజాగా, సంచయిత, ఊర్మిళ గజపతి రాజు మధ్య మరోసారి వివాదం నెలకొంది. విజయనగరంలో ప్రతిష్టాత్మిక సిరిమానోత్సవం జరుగుతుంది. గజపతిల కోట పై నుంచి ఆ కుటుంబం ఈ ఉత్సవం చూడటం ఆనవాయితీ. అయితే జరుగుతున్న విషయాలకు బాధపడి, అశోక్ గజపతి రాజు, ఈ ఉత్సవాలకు దూరంగా ఉన్నారు. అయితే ఆనంద గజపతి రాజు రెండో భార్య అయిన సుధ గజపతి, కూతురు ఉర్మిళ గజపతి, ఆనవాయితీ ప్రకారం కోట పై నుంచి సిరిమానోత్సవం చూడటానికి వచ్చారు.
అయితే ఇదే సమయంలో అక్కడే మాన్సాస్ ట్రస్ట్ చైర్మెన్ సంచయిత కూడా వచ్చారు. ఊర్మిళ గజపతి, సుధా గజపతి అక్కడ ఉండటం పై ఆమె అసహనం వ్యక్తం చేసారు. వారిని ఇక్కడ నుంచి పంపేయాలని, అక్కడ ఉన్న అధికారులకు చెప్పారు. అయితే వారు మాత్రం, ఇది కుటుంబ వ్యవహారం అని మీరు మీరు చూసుకోవాలని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారం పై, అవమానంగా భావించిన ఊర్మిళ గజపతి, సంచయిత గజపతి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అయితే ఈ మొత్తం ఘటన పై , ట్విట్టర్ ద్వారా ఘాటుగా స్పందించారు ఊర్మిళ. తన తండ్రి ఆనంద గజపతి ఉన్న దగ్గర నుంచి, కోట పై నుంచి సిరిమానోత్సవం చూడటం ఆనవాయితీగా వస్తుందని, ఈ ఏడాది రావద్దు అనుకున్నా, ఆనవాయితీని బ్రేక్ చేయటం ఎందుకని వచ్చామని అన్నారు. మేము ఇక్కడకు వచ్చిన తరువాత, మిగతా కుటుంబ సభ్యులు ఎవరూ లేరని గ్రహించామని, అయిన ఇది సాంప్రదాయం అని అన్నారు. సంచయిత ఒత్తిడికి లొంగిన ఇక్కడ పని చేసే వారు, తమ వద్ద గత 20 ఏళ్ళుగా పని చేసిన వారే, వారు వచ్చి, మమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పటం, చాలా అవమానకరం అని అన్నారు. అంతె కాదు, సిరిమానోత్సవం చూసే హక్కు, ఈ కుటుంబంలోని వ్యక్తులుగా మాకు ఉంది అని, ఎవరికీ మమ్మల్ని వెళ్ళమనే హక్కు లేదని తేల్చి చెప్పారు. మొత్తానికి గత కొన్ని వందల ఏళ్ళుగా ఎంతో గౌరవంగా బ్రతికిన పూసపాటి వంశంలో, ఈ రకంగా విబేధాలు బయట పడి, రచ్చకు ఎక్కాయి. రాజకీయంగా పావులు అయ్యారు.