సింహాచలం దేవ స్థానం అనువంశిక ధర్మకర్తల మండలి చైర్మన్ గాను, మాన్సాస్ ట్రస్టు చైర్మన్ గాను వైసీపీ ప్రభుత్వం అర్ధరాత్రి నియమించిన సంచయిత గజపతిరాజును పార్టీ నుంచి తొలగించాలని కోరుతూ అధిష్టానానికి లేఖ రాసింది ఏపి బీజేపీ. సంచయిత పార్టీ వ్యతిరేక కార్యకలాపు చేస్తున్నారు అంటూ, అధిష్టానానికి లేఖ రాసారు, ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల మధుకర్. పార్టీ సూచనలు లేకుండా, పార్టీకి చెప్పకుండా, ఆమె ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని ఆరోపించారు. అంతే కాకుండా, పార్టీ మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉంటే, ఆమె మాత్రం, సమర్ధిస్తూ ప్రకటనలు చేస్తున్నారని ఆ లేఖలో రాసారు. ఈ విషయం పై, ఇప్పటికే ఆమెకు షోకాజ్ నోటీసు కూడా ఇచ్చిన విషయాన్ని, ఆ లేఖలో ప్రస్తావించారు. ఇదే విషయం పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎల్.సంతోష్‌కి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా లేఖ రాసారు. భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఉన్న సంచైత గజపతిరాజును పార్టీ నుంచి సస్పెండ్ చెయ్యాలని కోరారు.
ఇక బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ కూడా ఈ విషయం పై ఘాటుగా స్పందించారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికలకు ముందు సంచయిత బీజేపీలో చేరారని, బీజేవైఎంలో కార్యవర్గ సభ్యురాలిగాను, ఢిల్లీ అధికార ప్రతినిధిగాను వ్యవహరిస్తున్నారు న్నారు. ఇప్పటి వరకూ ఎంతో హుందాగా ఈ బాధ్యతలు నిర్వహస్తూ వస్తున్న పూసపాటి రాజు వంశీయులను తప్పించి, అదే రాచకుటుంబానికి చెందిన సంచయితను వైసీపీ ప్రభుత్వం అర్ధరాత్రి వేళ, రహస్య జీవోలతో నియమించడం స్థాని కంగా సంచలనం రేపిందన్నారు. తన ప్రమాణ స్వీకారోత్సవంలో కూడా సంచయిత వైసీపీ ప్రభు త్వాన్ని, ఎంపీ విజయసాయిరెడ్డిని పొగుడుతూ చేసిన ప్రసంగాన్ని తప్పుపట్టారు.
సంచయిత నియామకం వెనుక కుట్రకోణం ఉందని తాము భావిస్తున్నట్టు వెల్లడించారు. సింహాచలం దేవ స్థానం, మాన్సాస్ ట్రస్టులకు విశాఖ పరిసరాల్లో వేలాది ఎకరాల విలువైన భూములున్నాయని, రాజధాని ప్రకటన నేపథ్యంలో ఈ నియామకం జరిగినట్టు తాము భావిస్తున్నామన్నారు. పూస పాటి రాజవంశీయుల కుటుంబానికి చెందిన ఈ వ్యవహారాన్ని వైసీపీ రాజకీయం చేసిందన్న అభిప్రాయం కూడా ప్రజల నుంచి వ్యక్తమవుతోంద న్నారు. ఇది రెండు పార్టీలు, రెండు కుటుంబాల రాజకీయ రాక్షస క్రీడగా తాము భావిస్తున్నామ న్నారు. సీఏఏ, ఎన్ ఆర్, ఎస్ఆర్ సీ విషయంలో వైసీపీ ప్రభుత్వం ఢిల్లీలో ఒకలా, ఏపీలో ఒకలా మాట్లాడుతోందని మాధవ్ ఆరోపించారు. ఢిల్లీలో బిల్లుకు మద్దతిచ్చి, అసెంబ్లీలో మార్పులు కోరుతూ తీర్మానించడం ద్వంద్వ వైఖరికి అద్దం పడుతుందన్నారు.