సంగం డెయిరీ విషయంలో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సంగం డెయిరీ స్వాధీనం చేసుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోని సస్పెండ్ చేసింది. సంగం డెయిరీని, ఏపి డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి అప్పగిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం జీవో 19 జారీ చేసింది. అయితే ఇది చట్ట విరుద్ధం, న్యాయ విరుద్ధం అంటూ, సంగం డెయిరీ డైరెక్టర్లు హైకోర్టులో ఈ జీవోని సవాల్ చేసారు. దీని పై రాష్ట్ర హైకోర్టు స్పందిస్తూ, కొద్ది సేపటి క్రితం తీర్పు వెలువరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో చెల్లదని స్పష్టం చేసింది. పైగా సంగం డెయిరీ రోజు వారీ కార్యకలాపాలు బయట వారికి ఇవ్వొద్దు అని, రోజు వారీ కార్యకలాపాలు సంగం డెయిరీ డైరెక్టర్లే పర్యవేక్షించాలని సంగం డెయిరీ సూచించింది. డైరెక్టర్ లు అందరూ కూడా, పాల సంఘాలతో ఎన్నుకో బడిన వారు కావటంతో, వారి అందరినీ కూడా సంగం డెయిరీ కార్యకలాపాలు పర్యవేక్షించే హక్కు ఉంటుందని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో పాటు, సంగం డెయిరీకి సంబంధించిన ఆస్తులు ఏమైనా కూడా అమ్మకాలు చేయాలి అంటే మాత్రం, హైకోర్టు అనుమతి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. వీటితో పాటు, సంగం డెయిరీకి సంబంధించి, ఏదైతే రాష్ట్ర ఏసిబి కేసు నమోదు చేసిందో, ఆ కేసు కొట్టివేయాలని చెప్పి, నరేంద్ర దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ పై కూడా, ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఏసిబి విచారణ పై స్టే ఇవ్వాలని నరేంద్ర తరుపు న్యాయవాదులు హైకోర్టులో వాదించారు. అయితే దీనికి సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుతం ఏదైతే విచారణ జరుపుందో, ఆ విచారణకు సంబంధించి కొన్ని అంశాల పై, అంటే ప్రస్తుతం ఏసిబి ఇష్టం వచ్చినట్టు చేస్తున్న తనిఖీల పై కూడా, వాళ్ళు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు.

sangam 07052021 2

సంగం డెయిరీలో పాల సేకరణ, మార్కెటింగ్ , అమ్మకాలు సంబంధించి కూడా ఏసిబి రికార్డులు తీసుకుంటుందని, దీని వల్ల తమ సంగం డెయిరీకి సంబంధించిన కీలకా సమాచారం, బయటకు వెళ్తుందనే భయం ఉందనే సమాచారం కూడా హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. ఈ నేపధ్యంలోనే హైకోర్టు స్పందిస్తూ, ఎఫ్ఐఆర్ లో నమోదు అయిన అంశాలు కాకుండా, వేరే ఇతర అంశాలు కానీ, ఇతర విభాగాల్లో కానీ, ఏసిబి తనిఖీ చేయవద్దు అని ఆదేశాలు ఇచ్చింది. అదే విధంగా సంగం డెయిరీలో జరుగుతున్నపాల సేకరణ, అమ్మకాలు, మార్కెటింగ్, వీటికి సంబంధించిన సమాచారం కూడా ఏది సేకరించ కూడదు అని కూడా ఆదేశాలు జారీ చేసింది. కొద్ది సేపటి క్రితం, హైకోర్టులోని మరో బెంచ్ లో విచారణ జరగటం, అక్కడ ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోనే సస్పెండ్ కావటంతో, ఈ రోజు నుంచి సంగం డెయిరీ అంతా కూడా, డైరెక్టర్ల ఆధీనంలోకి వెళ్లనుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read