పొరపాటున నోరు జారి, ఒక మాట మాట్లాడబోయి, ఇంకో మాట మాట్లాడితేనే, వైసిపీ నేతలు, ఎలా అల్లరి చేసే వాళ్ళో, వాళ్ళు ప్రతిపక్షంలో ఉండగా అందరూ చూసారు. ముఖ్యంగా లోకేష్ ని టార్గెట్ చేసుకుని, ఆయన స్పీచ్ లో దొర్లే ప్రతి చిన్న తప్పుని ఎత్తి చూపి, ఆయన్ను హేళన చెయ్యటం చూసాం. అలాగే అప్పటి అధికార పక్షం, ఏమైనా తప్పులు పెడుతూ బ్యానర్లు పెడితే, హేళన చేసి వదిలి పెట్టె వారు. అయితే కర్మ ఫలం ఎవరినీ వదలదు అన్నట్టు, ఇప్పుడు అధికారంలోకి వైసీపీ వచ్చింది, ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉంది. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు నోరు జారి, నవ్వుల పాలు అయ్యారు. తాజాగా ప్రభుత్వం వైజాగ్ లో పెట్టిన ఒక ప్రకటన బ్యానర్ కూడా నవ్వులు పాలు చేసింది. ప్రభుత్వానికి ఆ మాత్రం కూడా తెలియదా అంటూ, ప్రజలు నవ్వుకుంటుంటే, పొరపాటులను ఎత్తి చూపి, అప్పట్లో టిడిపిని హేళన చేసారు, ఇప్పుడు వీరే అనుభవిస్తున్నారు అని మరి కొంత మంది అంటున్నారు.
ఇక విషయంలోకి వెళ్తే, జాతీయ క్రీడాదినోత్సవ సందర్భంగా, ప్రభుత్వం తరుపున కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం సెహ్సిన ఏర్పాట్లలో వైజాగ్ లో ప్రభుత్వం తీరు విమర్శలకు దారి తీసింది. విశాఖ బీచ్ రోడ్డులో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన బ్యానర్లలో వచ్చిన తప్పిదాలు, ప్రభుత్వాన్ని నవ్వుల పాల్జేశాయి. టెన్నిస్ సూపర్ స్టార్ సానియా మీర్జా ఫొటో ముద్రించి, బ్యానర్ పై మాత్రం, ఆమె పేరును మాజీ అథ్లెట్ పీటీ ఉష పేరు రాశారు. ఈ రోజు నేషనల్ సపోర్ట్స్ డే సందర్భంగా ప్రభుత్వం తరుపున వైజాగ్ బీచ్‌రోడ్డులో, మంత్రి అవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో క్రీడా ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో పాల్గున్న క్రీడాకారులు ఈ బ్యానర్ చూసి అవాక్కయ్యారు. ఈ తరం స్పోర్ట్స్ స్టార్స్ కూడా ఈ ప్రభుత్వానికి తెలియదా అంటూ ఆశ్చర్య పోతున్నారు.
అయితే ఈ విషయం పై ఎమ్మెల్సీ నారా లోకేష్ కూడా ట్విట్టర్ లో స్పందించారు. "చంద్రబాబుగారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో క్రీడాకారులు గోపీచంద్ కు ఐదెకరాల స్థలం ఇచ్చి బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు సహకరించారు. ఇప్పుడా అకాడమీ పీవీ సింధులాంటి క్రీడా ఆణిముత్యాలను దేశానికి అందిస్తోంది. అది చంద్రబాబుగారి దార్శనికత. ఇక ఇప్పటి వైసీపీ ప్రభుత్వం క్రీడలకు ప్రోత్సాహం ఇచ్చే సంగతి అటుంచి, స్వాతిముత్యాల్లాంటి తమ పార్టీ నేతల క్రీడా పరిజ్ఞానంతో క్రీడాకారులను అవమానించకపోతే చాలు అన్నట్టు వ్యవహరిస్తోంది. సానియా మీర్జా ఎవరో, పి.టి. ఉష ఎవరో తెలీని దురవస్థలో క్రీడాశాఖ మంత్రి ఉన్నారు. #NationalSportsDay" అంటూ ట్వీట్ చేసారు.