ఒక మనిషి పట్ల గౌరవం ఎలా ఉంటుందో ఈ ఫోటో చూస్తే అర్ధమవుతుంది... మరో ఫోటోలో, ఒక మనిషి అంటే ఎంత చిరాకో అర్ధమవుతుంది... నిజానికి, ఈ ఆర్టికల్ రాయాలని లేదు... సాటి తెలుగువాడైన జగన్ ను, శరద్ పవార్ అవమానిస్తే, అది గొప్పగా చెప్పుకునే విషయం కాదు... కాని, జగన్, విజయసాయి రెడ్డి చేస్తున్న పనులు, గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రిని జాతీయ స్థాయిలో ఎలా అవమానపరుస్తున్నారో చూసిన తరువాత, ఇలాంటి మనుషుల గురించి,ఏమి రాసినా తప్పు లేదు అనిపించింది... చంద్రబాబు నాయుడు అనే అతని స్థాయి, దేశం మొత్తం ఆయానికి ఉండే గౌరవం, ఈ రోజు ప్రత్యక్షంగా ఢిల్లీలో కనిపిస్తుంది...

sarad pawar 03042018 2

అయితే, ఈ సందర్భంలో శరద్ పవార్ తో కలిసి ఉన్న ఫోటో మాత్రం, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది... చంద్రబాబు, శరద్ పవన్ కలిసి ఉన్న ఫోటో పక్కన, జగన్, ఒక సారి శరద్ పవర్ ను కలిసిన ఫోటో పక్క పక్కన పెట్టి, ఇద్దరికీ ఎలాంటి గౌరవం ఇస్తున్నారో చూడండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు... చంద్రబాబుని ఆప్యాయంగా పలకరిస్తుంటే, జగన్ ను మాత్రం, బయటకు వెళ్ళమంటూ చిరాకుగా పెట్టిన ఫోటో పెట్టి కామెంట్ చేస్తున్నారు... ఈ ఫోటో రెండేళ్ళ క్రిందట, తెదేపా ప్రభుత్వంపై ఢిల్లీ వెళ్లి అందరికీ ఫిర్యాదు చేద్దామని హస్తినకు వెళ్లిన జగన్‌కు, ఎన్‌సీపీ నేత శరద్‌పవార్‌ జలక్‌ ఇచ్చినప్పటిది..

sarad pawar 03042018 3

మీడియాను వెంటేసుకుని శరద్‌పవార్‌ ఛాంబర్‌కు వెళ్లిన జగన్‌ను ఆయన కసురుకున్నారు. చనువుగా కూర్చిలో కూర్చోవడానికి జగన్‌ ప్రయత్నించగా ముందు మీతో వచ్చిన ఆ జనం, మీడియా వాళ్లని అవతలకి పంపండి, ఈ గోల అంత ఏంటి నా దగ్గర అని పవార్‌ అసహనం వ్యక్తం చేశారు. మధ్యలో ఒంగోలు ఎంపీ ఎస్వీ.సుబ్బారెడ్డి ఒకే నిమిషం సార్‌ మీకు వినతిపత్రం ఇచ్చి వెళ్లిపోతాం అని ప్రాధేయపడినా పవార్‌ లెక్కచేయకుండా ముందు మీరు బయటకు వెళ్లండి. కావాలంటే ఒకరిద్దరు మాత్రమే లోనికి రండి అనటంతో మీడియా ఎదుటే జగన్‌కు జరిగిన పరాభవానికి అందరూ విస్తుపోయారు. "అస్తమాను లోకల్‌ గొడవలను తీసుకుని వచ్చి నాకు చెబితే నేనేం చేసేది" అని శరద్‌పవార్‌ ఆగ్రహం వ్యక్తం చేసారు... ఇది జాతీయ స్థాయిలో జగన్ కు ఉన్న ఇమేజ్.. ఇలాంటి ఇమేజ్ ఉన్నాడు, చంద్రబాబు ఢిల్లీ వచ్చి డ్రామాలు ఆడుతున్నాడు అంటే, ఎలా ఉంటుంది ? అందుకే ఈ ఫోటోలు పక్క పక్కన పెట్టి సోషల్ మీడియాలో తిప్పుతున్నారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read