ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచిత్రమైన కబ్జాలు ఆక్రమణలు మొదలయ్యాయి. ప్రభుత్వ భూములను వైసీపీ కబ్జా చేస్తోంది. ప్రైవేట్ స్థలాలను ప్రభుత్వం ఆక్రమిస్తోంది. ఇదొక విచిత్రమైన కబ్జాలపర్వం. బాపట్లలో వైసిపి కార్యాలయ నిర్మాణం కోసం ఆర్టీసీ గ్యారేజీ పక్కన ఉన్న 1.45 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని అధికారులు కేటాయించారు. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో మంత్రులు, ఎమ్మెల్యేలు భూమి పూజ చేశారు. దీనిపై వివాదం నడుస్తోంది. అనకాపల్లి జిల్లాలోనూ వైసీపీ కార్యాలయం కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలంపై వివాదం నడుస్తోంది. వైసీపీ తన ఆఫీసుల కోసం కబ్జాలకి తెగిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు భూములు, స్థలాలు ఖాళీగా ఉంచినందుకు పన్ను కట్టలేదనే కారణంతో ఆయా స్థలాల్లో ప్రభుత్వం నోటీసు బోర్డులు వేలాడదీస్తోంది. కట్టాల్సింది 5 వేలు అయితే 50 లక్షలల స్థలంని ప్రభుత్వం బోర్డు పాతేస్తోంది. ఇది ఉభయగోదావరి జిల్లాల్లో స్థలయజమానులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read