జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలోని,మైదకూరు నియోజకవర్గంలోని ఖాజీపేట మండలంలో, 13 మంది వైసీపీ సర్పంచ్లు మూకుమ్మడి రాజీనామా చేసి, షాక్ ఇచ్చారు. జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకోవటం, సంచలనానికి దారి తీసింది. ప్రతి శాఖలోనూ డబ్బులు తీసుకుంటున్న జగన్ ప్రభుత్వం, ఇప్పుడు పంచాయతీల ఖాతాలో కూడా డబ్బులు ఖాళీ చేసింది. తమ వద్ద కూడా డబ్బులు తీసుకున్నారని, ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయటానికి వీలు లేకుండా పోయిందని అంటున్నారు. ఇప్పటికే సంక్షేమ పధకాల అమలులో సర్పంచ్ల పాత్ర లేకుండా చేసారని, ఇప్పుడు 14వ, 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులను కూడా తీసేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా తాము పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఈ రోజు నుంచి తమ పంచాయతీల పరిధిలో, వీధి దీపాల నిర్వహణ, రోడ్ల మరమ్మతు లను, శానిటేషన్ కార్యక్రమం తో పాటుగా తదితర నిర్వహణ భారాలను తాము పట్టించుకోమని తెలిపారు. అయితే తాము పంచాయతీ సర్పంచ్ పదవులకు రాజీనామా చేయం అని, తమ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నామని తెలిపారు.

sarpanch 23112021 2

ఈ ప్రభుత్వంలో సర్పంచ్ పదవులకు విలువ లేకుండా పోయిందని బాధ పడుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనే, ఇలా గ్రామాల్లో వ్యతిరేకత ఉండటం కొసమేరపు. గ్రామ సర్పంచ్లు, ఈ విషయంలో బయట పడ్డారు. అయితే కడప జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుంది అనే అభిప్రాయం ఉంది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను కాకుండా, వేరే నిర్ణయం తీసుకునే సాహసం చేయరు. అలాంటిది, అక్కడ కూడా ప్రజలకు చిరాకు వస్తుంది అంటే పరిస్థితి ఎక్కడి వరకు వెళ్లిందో అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక, అప్పులు పుట్టాక, తాకట్టు పెడదాం అంటే కోర్టులు ఊరుకోక, ఆర్ధికంగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇబ్బందులు పడుతుంది. ఈ నేపధ్యంలోనే, గ్రామాలకు వెళ్ళే నిధులు కూడా ప్రభుత్వం తీసుకుని వాడేసుకుంటుంది. దీంతో గ్రామాల్లో అభివృద్ధి లేకుండా పోయింది. చిన్న చిన్న పనులు కూడా గ్రామాలు , ప్రభుత్వం వైపు చూసినా, ప్రభుత్వం ఏమి ఇవ్వలేని పరిస్థితిలో, ఈ రోజు కడపలో బయట పడ్డారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read