గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన నెల రోజులు గడిచినా నేటి వరకు పాలకవర్గాలకు అధికారాలు, బాధ్యతలు అప్పగిస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో నేటికీ గ్రామ పంచాయతీలు ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. అధికారికంగా ప్రమాణ స్వీకారం తేదీని నిర్ణయిస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. అప్పుడు పంచాయతీ కార్యదర్శులు ఆయా సర్పండ్లు, వార్డు సభ్యులతో ప్రమాణం చేయిస్తారు. అంతవరకు సర్పంచ్ హోదా ఉండదు. పంచాయతీకి సంబంధించి ఎటువంటి అధికారాలు సర్పంచ్ గా ఉండవు. ఆర్థిక సంవత్సరం ముగింపులో భాగంగా మార్చి నెలాఖరు కావడంతో 14వ ఆర్థిక సంఘం, జనరల్ ఫండ్ నిధులను ఇష్టారాజ్యంగా ఖర్చుచేసి తమకు బాధ్యతలు అప్పగించే నాటికి పంచాయతీల్లో ఖాళీ ఖజానా ను ప్రత్యేక అధికారులు అప్పగించే పరిస్థితులు కనిపిస్తున్నాయని నూతనంగా ఎన్నికైన సర్పంచులు వాపోతున్నారు. గత నెలలో ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. నూతన సర్పంచులు, వారి మద్దతుదారులు విజయోత్సవాలు జరుపుకున్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయి నెల రోజులు దాటింది. కానీ ఇంతవరకు సర్పంచులుగా అధికారికంగా బాధ్యతలు చేపట్టలేదు. పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులు చేసేంత వరకు సర్పంచులు పదవీ బాధ్యతలు చేపట్టడానికి వీలులేదు. 2013 లో జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే సర్పంచులకు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నెల రోజులు గడిచిన ఎటు వంటి ఉత్తర్వులు వెలువడలేదు. ఆర్థిక సంవత్సరం ముగిసిన అనంతరం సర్పంచులు బాధ్యతలు చేపట్టేందుకు ఉత్తర్వులు జారీ చేస్తారని సమాచారం.
ఎన్నికలు జరిగి, ఫలితాలు ప్రకటించిన తేదీతో సంబంధం లేకుండా, ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి సర్పంచులు, వార్డు సభ్యులకు ఐదేళ్లపాటు పదవీకా లం ఉంటుంది. పంచాయతీల్లో సచివాలయ ఉద్యోగులకు సెలవులు మంజూరు చేయాలన్నా, నిధులను డ్రా చేయాలన్నా సర్పంచ్ లకు చెక్ పవర్ ఉంటుంది. అధికారికంగా జీవో జారీ చేసినా నాటి నుంచి మాత్రమే సర్పంచ్ గా అన్ని రకాల అధికారాలు లభిస్తాయి. మరోవైపు సర్పంచుల బాధ్యతలకు సంబంధించి కొన్ని మార్పులు ఉండొచ్చనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద ఏప్రిల్ లోగానీ వీరు బాధ్యతలు చేపట్టే అవకాశలు లేవని అంటున్నారు. ఈ నెలాఖరుకు 14వ ఆర్థిక సంఘం నిధులు మురిగిపోనున్నాయి. వీటిని ప్రత్యేక అధికారుల చేత ఖర్చు పెట్టించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు చెబుతు న్నారు. ఈ నెలాఖరు వరకు పంచాయతీ ప్రత్యేకాధికారుల ఏలుబడే కొనసాగే పరిస్థితి ఉంది. 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా పంచాయతీలకు మంజూర య్యి నిధులు, విధులపై సర్వహక్కులు పాలక వర్గాలకే ఉంటాయి. ప్రత్యేకాధికా రులు నిధుల దుర్వినియోగం, మళ్లింపు, ఇష్టారాజ్యంగా ఖర్చు చేయడంతోపాటు ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న బిల్లులను క్లియర్ చేసుకునే పనిలో ఉన్నారు. అధికారి కంగా ఇంకా పదవీ బాధ్యతలు చేపట్టని విషయం చాలామందికి తెలియదని, తాగునీ టి సమస్యను పరిష్కరిరచాలని, సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణం చేపట్టాలం టూ ప్రజలు ఒత్తిడి తీసుకువస్తున్నారని పలువురు సర్పంచులు వాపోతున్నారు.