వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక రిలయన్స్ గ్రూప్ ఉంది అంటూ, హడావిడి చేసి, ఉమ్మడి ఏపిలో వీరంగం చేసిన వైసీపీ, నేడు అదే అంబానీకి సన్మానాలు చెయ్యటం పై అందరూ ఆశ్చర్య పోయారు. ఎన్నికలు వస్తున్నాయి అంటే, రాజశేఖర్ రెడ్డి మరణం పై అనుమనాలు ఉన్నాయి అంటూ, రిలయన్స్ వైపు చూసే వైసీపీ, ఇప్పుడు అదే అంబానీకి రెడ్ కార్పెట్ వెల్కమ్ పలికింది. దీని పై వైఎస్ఆర్ హార్డ్ కోర్ ఫాన్స్, తీవ్రంగా నిరాస పడ్డారు. మాటలు మార్చను అని చెప్పే జగన్, ఇలా మారిపోయారు ఏమిటో అని మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ అంశం పక్క పెడితే, రిలయన్స్ అంబానీ, నాలుగు రోజుల క్రిందట జగన్ మోహన్ రెడ్డిని కలిసి, చర్చించారు. అయితే ఎందుకు కలిసారు అనే దాని పై, ఎటువుంటి సమాచారం బయటకు రాలేదు. ప్రభుత్వం కాని, అటు వైసీపీ పార్టీ కాని, ఎటువంటి అధికారిక ప్రకటన చెయ్యలేదు. అయితే, తమ సొంత మీడియాలో, సోషల్ మీడియాలో మాత్రం, రిలయన్స్ అంబానీ, జగన్ మోహన్ రెడ్డి విజన్ నచ్చి, మన రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెడుతున్నారు అంటూ ప్రచారం చేసారు.
అయితే, ఇది ఎంత వరకు నిజమో తెలియదు. ఎందుకుంటే, రిలయన్స్ లాంటి వ్యక్తి పెట్టుబడి పెట్టటానికి వస్తే, అది పెద్ద సెన్సేషన్. ఏపి ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంది, ఇతర పెట్టుబడిదారులను ఆకర్షించుకుంటుంది. అయితే, ఇటు ప్రభుత్వం కానీ, అటు అంబానీ కాని, పెట్టుబడులు పై ఎటువంటి ప్రకటన చెయ్యలేదు. చివరకు అంబానీ జగన్ ను కలిసింది, అమిత్ షా సూచన పై అని, అంబానీ సన్నిహితుడు, పరిమల్ నత్వానీని, ఏపి నుంచి రాజ్యసభకు పంపించటానికి అంటూ వార్తలు వచ్చాయి. అయితే, వైసీపీ వర్గాలు మాత్రం అలా ఏమి లేదని, మేము బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తాం అంటూ సన్నాయి నొక్కులు నోక్కాయి. అయితే అంబానీ జగన్ తో మీట్ అయ్యింది పెట్టుబడులు కోసం కాదని తేలిపోయింది.
ఆ రోజు తాము జగన్ ను కలిసింది, తనకు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించాలని కోరటానికే, ఆంధ్రప్రదేశ్ వచ్చామని, ఝార్ఖండ్ స్వతంత్ర ఎంపీ పరిమల్ నత్వానీ చెప్పారు. పార్లమెంటు సెంట్రల్ హాలులో విలేఖరులతో మాట్లాడుతూ, ఆయన ఈ విషయం చెప్పారు. ఈ సారి, ఝార్ఖండ్ నుంచి కాంగ్రెస్, బీజేపీలకు చెరో సీటు వస్తున్న నేపధ్యంలో, తనకు అక్కడ నుంచి రజ్యసభకు వెళ్ళే అవకాసం లేదని, అందుకే తాను, ఏపి నుంచి, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాసం ఇవ్వమని, ముకేష్ అంబానీతో కలిసి, అమరావతి వచ్చి జగన్ ను కలిసనాని చెప్పారు. అయితే జగన్ దానికి స్పందిస్తూ, తనకు మూడు రోజులు టైం కావాలని అడిగారని, నత్వానీ తెలిపారు. ఇది ఇలా ఉంటే, నత్వానీకి ఏపి నుంచి రాజ్యసభకు వెళ్ళటానికి లైన్ క్లియర్ అయ్యిందని, డైరెక్ట్ అమిత్ షా సూచన కావటంతో, జగన్ కూడా ఏమి చెయ్యలేని పరిస్థితి అని తెలుస్తుంది.