భార‌త రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ స‌తీమ‌ణి, దేశ ప్ర‌థ‌మ మ‌హిళ విజ‌య‌వాడ న‌గ‌రంలో మూడు గంట‌ల పాటు ప‌ర్య‌టించారు. రాష్ట్ర‌ప‌తితోపాటు గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న స‌విత‌ కోవింద్, కుమార్తె స్వాతితో కలిసి విడిగా విజ‌య‌వాడ‌లో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. స‌విత కోవింద్, స్వాతి కోవింద్ ల‌కు రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ ఆత్మీయ స్వాగ‌తం ప‌లికారు. అమరావతిలో జరిగిన ఫైబర్ గ్రిడ్ ప్రారంభోత్సవంలో కోవింద్ పాల్గొనగా, ఆమె గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి, రోడ్డు మార్గం ద్వారా విజయవాడ వెళ్లారు, అక్కడ నుంచి వెలగపూడి సచివాలయానికి వెళ్లారు.

kovind 28122017 2

ఈ సందర్భంగా, విజయవాడ రోడ్లు, వెలగపూడి రోడ్లు క్లీన్ గా ఉండటం పై స‌విత‌ కోవింద్, భుమా అఖిల ప్రియతో ప్రభుత్వ పని తీరును మెచ్చుకున్నారు. రోడ్లుకి ఇరు వైపులా మొక్కలు, గోడలకి పెయింటింగ్స్ ఇవన్నీ చూసి, మెచ్చుకున్నారు దేశ ప్రధమ మహిళ... రోడ్లు కూడా చాలా క్లీన్ గా ఉన్నాయని కొనియాడారు... ఈ సందర్భంగా స్వచ్ఛ ఆంధ్ర కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అఖిల ప్రియ వివారించారు. స‌విత కోవింద్ ముందుగా, స్వ‌రాజ్ మైదాన్ లో పుష్ప ప్ర‌ద‌ర్శ‌న‌ను స‌విత కోవింద్ సంద‌ర్శించారు.అనంత‌రం క‌న‌క‌దుర్గ ఆల‌యాన్ని స‌విత కోవింద్ ద‌ర్శించి అమ్మ‌వారికి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఆల‌య మ‌ర్యాద‌ల‌తో ప్ర‌థ‌మ మ‌హిళ‌ల‌కు స్వాగ‌తం ప‌లికిన వేద‌పండితులు స‌విత కోవింద్, స్వాతి ల‌కు ఆశీర్వ‌చ‌నం చేశారు.

kovind 28122017 3

అక్కడ నుంచి భవానీ ఐలాండ్ కు వెళ్లారు. సవితా కోవింద్ భవాని ద్వీపంలో గంటకు పైగా గడిపారు. హరిత బెర్మ్ పార్క్ నుంచి బోటులో సవితా కోవింద్ , స్వాతి కోవింద్ లను మంత్రి అఖిల ప్రియ భవానీ ద్వీపానికి తీసుకువెళ్ళారు. అక్కడ మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో కళాకారులు స్వాగతం పలికారు. అనంతరం నృత్యం, కోలాటం ప్రదర్శనలను సవితా కోవింద్ తిలకించారు. దేశంలోనే ప్రతిష్ఠాత్మకంగా ఏపీ టూరిజం ప్రవేశపెట్టిన మ్యూజికల్ ఫౌంటెయిన్ ను ప్రథమ మహిళ ఆసక్తిగా చూశారు. భవాని ద్వీపం చాలా బాగుందని, ఇక్కడ పర్యాటకం ఎంతో ఆహ్లాదంగా ఉందని సవితా కోవింద్ కొనియాడారు. ఆమెకు సంప్రదాయ పద్దతిలో మంత్రి అఖిల ప్రియ పట్టు చీర‌లు, ల‌డ్డులు, క‌జ్జికాయ‌లు బహూకరించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read