గత వారం రోజులుగా జంగారెడ్డిగూడెంలో జరిగిన కల్తీ సారా మరణాల పై, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎక్ష్పొజ్ చేయటంలో తెలుగుదేశం పార్టీ సక్సెస్ అయ్యింది. ఇది ప్రజల్లోకి కూడా బాగా వెళ్ళింది. అయితే తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో చేసిన ఈ ఉద్యమాన్ని, గ్రౌండ్ లెవెల్ లోకి తీసుకుని వెళ్ళటానికి, శనివారం, ఆదివారం కూడా కార్యక్రమాలు చేస్తుంది. అయితే ఈ కార్యక్రమం ప్రజల్లోకి బలంగా వెళ్ళటంతో, దీనికి ఎలా కౌంటర్ ఇవ్వాలి అని అలోచిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, పశ్చిమ బెంగాల్ సియం మమతా రూపంలో, ఒక ఫేక్ ఆరోపణ దొరికింది. గతంలో చంద్రబాబు నాయుడు పెగాసేస్ కొన్నారు అంటూ, మమతా బెనర్జీ వ్యాఖ్యలు చేసింది అంటూ వైసీపీ సోషల్ మీడియా, సాక్షి హడావిడి మొదలు పెట్టారు. అయితే ఇప్పటి వరకు మమతా మాట్లాడిన వీడియో అయితే బయటకు రాలేదు. ఇది కూడా పింక్ డైమెండ్ లాగా ఫేక్ ప్రచారమా లేదా అనేది కూడా తెలియదు. అక్కడ మమతా బెనర్జీకి, ఇక్కడ జగన్ మోహన్ రెడ్డికి కూడా, ఒక్కరే సలహదారు కాబట్టి, ఇద్దరూ అనుకుని చంద్రబాబు పైన ఈ పెగాసేస్ ఆరోపణలు చేస్తున్నారు ఏమో తెలియదు కానీ, మమతా బెనర్జీ , చంద్రబాబు పైన పెగాసేస్ ఆరోపణలు చేసింది అంటూ, వైసీపీ నిన్నటి నుండి ఒకటే గోల మొదలు పెట్టింది.
అయితే తెలుగుదేశం పార్టీ , ఇది వరకు లాగే లేదు కాబట్టి, వెంటనే దీనికి కౌంటర్ ఇచ్చింది. దీని పైన నారా లోకేష్ స్పందిస్తూ, పెగాసేస్ మా దగ్గర ఉంటే, అసలు జగన్ మోహన్ రెడ్డి ఎలా గెలిచే వారు అంటూ ప్రశ్నిస్తూ, మేము కొనుగోలు చేసి ఉంటే, ప్రభుత్వం మమ్మల్ని వదిలి పెట్టేదా అని ప్రశ్నించారు. ఇక టిడిపి నేతలు కూడా, అదే కనుక ఉండి ఉంటే, విశాఖలో కోడి కత్తి డ్రామా నుంచి, బాబాయ్ పోటు వరకు అన్నీ బయట పెట్టే వాళ్ళం కదా అని కౌంటర్ ఇచ్చారు. ఈ రాజకీయ ఆరోపణలు పక్కన పెడితే, మాజీ డీజీపీ సావాంగ్ గతంలో ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానం, ఇప్పుడు వైసీపీకి షాక్ కొట్టేలా చేసింది. గతంలోనే ఈ అంశం పై, ఏడాది క్రితం, 2021 జూలై 25న ఒక ఆర్టిఐ రిప్లై కి సమాధానంగా, ఏపి పోలీసులు ఎప్పుడూ కూడా పెగాసేస్ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేయలేదని, స్పష్టం చేస్తూ గౌతం సావాంగ్ సమాధానం ఇచ్చారు. దీంతో ఉదయం వరకు ఎగిరెగిరి పడిన వైసీపీ నేతలు, శ్రేణులు, గౌతం సవాంగ్ రిప్లయ్ బయటకు రావటంతో, సైలెంట్ అయి కూర్చున్నారు.