విశాఖపట్నంలో చంద్రబాబుని వైసీపీ నేతలు అడ్డుకోవటం, ఎయిర్ పోర్ట్ లో వీరంగం చెయ్యటం, అలాగే అయుదు గంటలు పాటు చంద్రబాబుని కదలనియ్యకుండా చెయ్యటం, చివరకు వైసీపీ వారిని ఏమి చెయ్యకుండా, చంద్రబాబుకు 151 సెక్షన్ కింద నోటీసు ఇచ్చి, చంద్రబాబుని పోలీసులు అరెస్ట్ చెయ్యటం తెలిసిందే. అయితే, ఈ విషయంలో మాత్రం అందరూ షాక్ తిన్నారు. ఎందుకంటే, చంద్రబాబు పర్మిషన్ తీసుకుని, యాత్రకు వచ్చారు. పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇస్తే, దానికి తగ్గట్టే చంద్రబాబు వచ్చారు. అయితే అంతకు ముందు రోజు, చంద్రబాబుని అడ్డుకుంటాం అని వైసీపీ మంత్రులే చెప్పినా, దాని కోసం ముందే ప్లాన్ చేసినా, పోలీసులు మాత్రం వారిని అడ్డుకోలేదు. ఏకంగా 500 నుంచి వెయ్యి మంది వైసీపీ కార్యకర్తలను ఏకంగా విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లోకే అనుమతి ఇచ్చారు. పోనీ చంద్రబాబు వచ్చిన తరువాత వారిని క్లియర్ చేసారా అంటే అదీ లేదు. ఇంతా జరిగి, చివరకు చంద్రబాబునే అరెస్ట్ చేసి, వైజాగ్ నుంచి హైదరాబాద్ పంపించారు.

sawang 02032020 2

అయితే, దీని పై తెలుగుదేశం పార్టీ సీరియస్ అయ్యింది. విశాఖ పోలీసులు తీరు, అదే విధంగా ప్రభుత్వం తీరు పై, హైకోర్ట్ లో లంచ్ మోషన్ పిటీషన్ వేసారు. అయితే రెండు రోజుల క్రితం ఈ పిటీషన్ పై విచారణ చేపట్టిన కోర్ట్, ఆ రోజే తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎక్కడైనా అనుమతి ఇచ్చి, వచ్చిన వ్యక్తిని అరెస్ట్ చెయ్యటం ఏమిటి ? గొడవ చేసిన వారిని కదా అరెస్ట్ చెయ్యల్సింది అంటూ కోర్ట్ ప్రశ్నించింది. అసలు చంద్రబాబుకి 151 నోటీస్ ఇచ్చి, ఆయన్ను ఎందుకు అరెస్ట్ చెయ్యాల్సి వచ్చింది అంటూ, కౌంటర్ వెయ్యాలి అంటూ, పోలీసులను హైకోర్ట్ ఆదేశిస్తూ, విశాఖ సిపీకి, రాష్ట్ర డీజీపీకి నోటీసులు ఇచ్చింది హైకోర్ట్. అయితే, కోర్ట్ ఆదేశాలు ప్రకారం, ఈ రోజు పోలీసులు, కౌంటర్ వేసారు. ఈ రోజు ఈ కేసు పై విచారణ జరిగింది.

sawang 02032020 3

ఈ విచారణ పై, టిడిపి తరుపు న్యాయవాది, కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఈనెల 12న డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ కోర్టుకు హాజరుకావాలని, చంద్రబాబుని ఎందుకు అరెస్ట్ చెయ్యాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలి అంటూ, కోర్ట్ ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు. ఈ కేసు పై తదుపరి విచారణను, ఈనెల 12కు వాయిదా వేసిందని చెప్పారు. పోలీసులు పర్మిషన్ ఇస్తే చంద్రబాబు వచ్చారని, అలాంటిది, చంద్రబాబుని ఎందుకు అరెస్ట్ చేసారు, గుడ్లు, రాళ్ళు వేసిన వారిని ఎందుకు నివారించలేదు అంటూ కోర్ట్ అడిగినట్టు న్యాయవాది చెప్పారు. ఈ రోజు పోలీసులు వేసిన కౌంటర్ తో, కోర్ట్ సంతృప్తి చెందలేదు కాబట్టే, డీజీపీని కోర్ట్ కు వచ్చి హాజరు అవ్వమని, వివరణ ఇవ్వమని కోర్ట్ చెప్పినట్టు, న్యాయవాది, కృష్ణారెడ్డి అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read