అమరావతిలో మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, అక్రమంగా భూములు కొనుగోలు చేసారు అంటూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ పై , హైకోర్టు గతంలోనే స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ స్టే ని సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం ఉపర్`సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసింది. దాని పై ఈ రోజు, వినీష్ శరన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజు విచారణ చేసింది. ఈ విచారణలో ఏపి ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ వాదించారు. ఆయన వాదిస్తూ, ఈ కేసు విచారణలో హైకోర్టులోనే విచారణ జరగాలని, ఈ కేసు విచారణ హైకోర్టులోనే జరిగేందుకు అనుమతి ఇవ్వండి, మేము దాఖలు చేసిన పిటీషన్ ను కూడా ఉపసంహరించుకునేందుకు కూడా అనుమతి ఇవ్వండి అంటూ, కోర్టుని కోరారు. అయితే ఆ సందర్భంగా దమ్మాలపాటి తరుపున హాజరైన సిద్ధార్ధ లుత్రా అసలు ఈ కేసులో స్టే విధించాలని వాళ్ళు ఈ పిటీషన్ లో కోరలేదని అన్నారు. దీనికి ఏపి ప్రభుత్వం తరుపు ధావన్ మాట్లాడుతూ, మేము ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన వెంటనే దాని పై కోర్టుని ఆశ్రయించారు, సాయంత్రానికే హైకోర్టు స్టే ఇచ్చిందని, గ్యాగ్ ఆర్డర్ ఇచ్చిందని, వాటిని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వచ్చామని, సుప్రీం కోర్టు గ్యాగ్ ఆర్డర్ ని తొలగించిందని, అక్కడి వరుకే ఈ పిటీషన్ పరిమితం అని అన్నారు.

sc 13072021 2

ఏపి ప్రభుత్వం తరుపు లాయర్ వాదిస్తూ, ఈ కేసు విచారణ సుప్రీం కోర్టులో విచారణ జరగటానికి వీలు లేదని, ఈ కేసు విచారణ సుప్రీం కోర్టులోనే జరగాలని, కాబట్టి హైకోర్టుకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని, మేము వేసిన పిటీషన్ కూడా ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అంతే కాకుండా ఈ కేసులో, సిబిఐ దర్యాప్తుకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని, కోర్టు కూడా సిబిఐ విచారణకు ఆదేశిస్తే మాకు అభ్యంతరం లేదని అన్నారు. అంతే కాకుండా, సిట్టింగ్ జడ్జి, రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో విచారణ జరపవచ్చని, అంత వరకు కూడా ఎటువంటి దుందుడుకు చర్యలు మేము తీసుకోమని ఏపి ప్రభుత్వం తరుపున, సుప్రీం కోర్టుకు తెలిపారు. దమ్మాలపాటి తరుపున హాజరైన మరో న్యాయవాది హరీష్ సాల్వే మాట్లాడుతూ, వ్యవస్థ ప్రతీకారం ఇంకా ఎన్నాళ్లంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కొంత ఉద్రిక్తతకు దారి తీసాయి. అయితే దీని పై సుప్రీం కోర్టు ఇంకా ఏమి నిర్ణయం తీసుకోలేదు. దీని పై తదుపరి విచారణను జూలై 22కు వాయిదా వేస్తూ, ఆ రోజు మేము డిసైడ్ చేస్తాం అంటూ సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వం మొదట ఎందుకు పిటీషన్ వేసింది, ఇప్పుడు ఎందుకు ఉపసంహరించుకుంటుంది అనేది అర్ధం కావటం లేదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read