ఈ రోజు సుప్రీం కోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ బెంచ్ లో ఒక పిటీషన్ విచారణ సందర్భంగా, చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉండటంతో, మనకు కూడా ఈ కేసు పై ఆసక్తి నెలకొంది. ఈ రోజు సుప్రీం కోర్టులో, రాజద్రోహం, సెక్షన్ 124 (ఏ) ని రద్దు చేయలియా నటు, రేగిరేడ్ మేజర్ జనరల్ ఎస్జీ వోంబట్ కేర్ దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ జరిగింది. ఈ పిటీషన్ పై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో ధర్మాసనం విచారణ చేసింది. అయితే ఇటువంటి రాజద్రోహం, సెక్షన్ 124 (ఏ), కేసుని రద్దు చేయాలి అంటూ పలు పితీషన్లు దాఖలు అయ్యాయి. ఈ పిటీషన్లు అన్నీ కూడా జస్టిస్ లలిత నేతృత్వంలో మరో ధర్మాసనంలో విచారణ జరుగుతుంది. అయితే ఆ ధర్మాసనానికే ఈ పిటీషన్ కు విచారణ ఇవ్వాలి, అది 22వ తేదీన విచారణకు వస్తుంది కాబట్టి, ఈ పిటీషన్ కూడా దానికే జత చేయాలి అంటూ, అటార్నీ జనరల్ వేణుగోపాల్, చీఫ్ జస్టిస్ కు విజ్ఞప్తి చేసారు. అయితే ఈ సందర్భంగా, జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ, ఏ కేసు ఎప్పుతూ వినాలి అనేది తరువాత నిర్ణయం తీసుకుంటాం అని చెప్తూనే, ఈ రాజద్రోహం, సెక్షన్ 124 (ఏ) కు సంబంధించి జస్టిస్ ఎన్వీ రమణ పలు కీలక వ్యాఖ్యలు చేసారు.

cj 15072021 2

70 ఏళ్ళ వ్యక్తి, దేశానికి సేవ చేసిన వ్యక్తి ఇటువంటి పిటీషన్ దాఖలు చేసారు అంటే, ఏమనుకోవాలి అని చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. రాజద్రోహం, సెక్షన్ 124 (ఏ) అనేవి పిచ్చోడి చేతిలో రాయ లాగా ఉందనే అభిప్రయాన్ని వ్యక్తం చేసారు. రాజద్రోహం, సెక్షన్ 124 (ఏ) అనేది దుర్వినియోగం అవుతుందని, ఈ సెక్షన్ కింద శిక్ష పడిన కేసులు నామమాత్రంగానే ఉన్నాయని, ఫ్యాక్షనిస్టులు కూడా ఈ సెక్షన్ ని తమ ప్రత్యర్ధుల పై వాడతారని, రాజకీయ ప్రత్యర్దులని అణిచివేయడానికి సెక్షన్ 124ఏను అక్రమంగా ఉపయోగిస్తున్న ఉదంతాలు కూడా మనం చూసాం అని చీఫ్ జస్టిస్ అన్నారు. అప్పట్లో, స్వాతంత్ర సమరయోధులను అణిచేయడానికి, బ్రిటీష్ పాలకులు వాడిన ఈ చట్టం ఇంకా అవసరమా అనిది పరిశీలించండి అని అన్నారు. ఈ సెక్షన్ పై నమోదు అయిన పిటీషన్ లు అన్నీ తాము విచారిస్తామని చీఫ్ జస్టిస్ అన్నారు. అయితే ఇదే కేసులో ఏపిలో సంచలనంగా మారిన రఘురామరాజు, ఏబిఎన్, టీవీ5 పై కేసులు నమోదు అయ్యాయి. మొత్తానికి ఇప్పుడు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలతో, ఈ కేసు పై కూడా ప్రభావం చూపి, ఇవే ప్రశ్నలు ఏపికి కూడా తగలనున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read