ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తున్న సుప్రీం కోర్టు ఆదేశాలు వచ్చేసాయి. స్థానిక ఎన్నికలు జరపాలి అంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం పై, హైకోర్టు స్పందిస్తూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే దీని పై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ పిటీషన్ ఈ రోజు సుప్రీం కోర్టు ముందుకు విచారణకు వచ్చింది. ప్రభుత్వం వేసిన పిటీషన్ తో పాటుగా, ఉద్యోగులు వేసిన పిటీషన్ ని కూడా సుప్రీం కోర్టు ఈ రోజు విచారణకు తీసుకుంది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజు ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించింది. ఈ పిటీషన్ ను కొట్టేస్తూ, సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కమీషనర్ నిర్ణయంలో, తాము జోక్యం చేసుకోమని కోర్టు చెప్పింది. ఈ సందర్భంగా ఉద్యోగులు సంఘం నేతల పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మీపైన ఎలక్షన్ కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోకూడదు అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటీషన్ ను చూస్తుంటే, ఎన్నికల కమిషన్ పై మీ వైఖరి ఏమిటో అర్ధం అవుతుందని అన్నారు. అలాగే ఉద్యోగ సంఘాలు పిటీషన్ పైన కూడా ఆగహ్రం వ్యక్తం చేసింది. మీ ఉద్దేశాలు అర్ధం అవుతున్నాయని, మీకు ఇందులో సంబంధం ఏమిటి, అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

sc jagan 25012021 2

ఇక స్థానిక సంస్థల ఎన్నికల పై గత పది రోజులుగా హైడ్రామా నడుస్తుంది. ముందుగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రకారం, ప్రభుత్వం నుంచి ముగ్గురు సీనియర్ అధికారులు, ఎన్నికల కమీషనర్ ని కలవటం, అదే రోజు ఆయన [ప్రొసీడింగ్స్ ఇవ్వటం చకచకా జరిగిపోయాయి. అయితే ప్రభుత్వం వెంటనే హౌస్ మోషన్ పిటీషన్ వేసింది. హైకోర్టుకు సంక్రాంతి సెలవులు కావటంతో, ఈ పిటీషన్ ని సింగల్ బెంచ్ విచారణ చేసి, ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. తరువాత రాష్ట్ర ఎన్నికల కమిషన్ డివిజన్ బెంచ్ ముందు ఈ పిటీషన్ ను విచారణ చేసింది. ఎన్నికలు జరుపుకోవచ్చు అంటూ 30 పేజీల తీర్పు ఇచ్చింది. దీని పై ప్రభుత్వం సుప్రీం కోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ వేయగా, సుప్రీం కోర్టు రెగ్యులర్ పిటీషన్ గానే తీసుకుంది. ఈ మధ్యలోనే ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. అయితే ప్రభుత్వం, ఉద్యోగులు, హైకోర్టు ఇచ్చిన తీర్పు కానీ, ఎన్నికల కమీషనర్ నిర్ణయాన్ని కూడా లెక్క చేయటం లేదు. ఈ రోజు నుంచి నామినేషన్ లు తీసుకోవాల్సి ఉండగా, అది కూడా మొదలు కాలేదు. ఇక ఇప్పుడు సుప్రీం కోర్టు చెప్పటంతో, ఇప్పటికైనా ప్రభుత్వం, ఉద్యోగులు స్పందిస్తారో లేక రాజ్యాంగ సంక్షోభం వైపు రాష్ట్రం వెళ్తుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read