ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం, రేపు సిబిఐ కోర్టు ఏమి తీర్పు ఇస్తుందా అనే టెన్షన్ లో ఉంది. జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో, ఆయన బెయిల్ పై బయట ఉన్న సంగతి తెలిసిందే. మొన్న ఎన్నికల్లో అయన ప్రభుత్వంలోకి వచ్చారు. అయితే ఆయన పై కేసులు విచారణ నెమ్మదిగా సాగుతుంది. దాదాపుగా 9 ఏళ్ళు ఆయన బెయిల్ పై ఉన్నారు. వీటి అన్నిటి నేపధ్యంలో, రఘురామకృష్ణం రాజు, జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అంటూ, సిబిఐ కోర్టులో పిటీషన్ వేసారు. జగన్ మోహన్ రెడ్డి సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారని, తన సహా నిందితులకు పదవులు ఇస్తున్నారని, ఇలా అనేక కారాణాలు కోర్టు ముందు వాదించారు. ఇక ఇదే సమయంలో సిబిఐ వైఖరి కూడా అందరినీ ఆశ్చర్య పరిచింది. తాము విచారణ చేస్తున్న నిందితుడికి బెయిల్ ఇవ్వాలో, వద్దో చెప్పలేని స్థితిలో సిబిఐ ఉండి పోయింది. కోర్టుకు బెయిల్ రద్దు చేయమని, వద్దు అని చెప్పకుండా, ఉండి పోయింది. వీటి అన్నిటి నేపధ్యంలో, రేపు ఆగష్టు 25 తారీఖు జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై తీర్పు రానుంది. దీంతో రాష్ట్రం మొత్తం ఏమి జరుగుతుందా అని టెన్షన్ పడుతుంది. వైసీపీ పార్టీలో కూడా ఈ టెన్షన్ ఉంది. అయితే అనూహ్యంగా ఈ రోజు సుప్రీం కోర్టు నుంచి బెయిల్ రద్దు చేసే విషయంలో, ఒక సంచలన తీర్పు వచ్చింది.

case 24082021 2

ఒక హ-త్య కేసు విషయంలో, అలహాబాద్, ఉత్తరాఖండ్‌ హైకోర్టులు ఇచ్చిన తీర్పులు ఉదహరిస్తూ, వారు ఇచ్చిన బెయిల్ ని రద్దు చేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ తీర్పులో కొన్ని కీలక విషయాలు పేర్కొంది. బెయిల్ ఇవ్వటానికి ఏమి అయితే పరిగణలోకి తీసుకుంటారో, బెయిల్ రద్దు చేయటానికి కూడా అవే పరిగణలోకి తీసుకోవాలని చెప్పింది. అందులో ముఖ్యంగా, నేరాన్ని మళ్ళీ రిపీట్ చేసే అవకాసం ఉంటే కానీ, సాక్ష్యులను ప్రభావితం చేసే ఆవకాశం ఉంటే కానీ, బెయిల్ ఇస్తే, దాని ప్రభావం తీర్పు మీద ఉండే అవకాసం ఉంటే కానీ, అతని క్యారక్టర్, బిహేవియర్, అతని నేపధ్యం ఇలా అనేక విషయాలు సుప్రీం ఉదహరించింది. అంతే కాకుండా, తన బెయిల్ రద్దు చేయాలని అపీల్ చేసిన వ్యక్తికి హాని జరుగుతుంది అనుకుంటే కూడా వర్తిస్తుందని చెప్పింది. అయితే ఇవే అంశాలు రఘురామకృష్ణం రాజు వాదించారు. రేపు జగన్ బెయిల్ రద్దు పై తీర్పు వస్తున్న నేపధ్యంలో, ఈ రోజు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు, ఆసక్తి రేపుతుంది. మరి రేపు ఏమి జరుగుతుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read