ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులోనే కాదు, సుప్రీం కోర్టులో కూడా వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల కమిషనర్ ని తప్పించటం, రాజధని అమరావతి విషయం, రంగుల విషయం, ఇలా ప్రతి విషయంలోనూ ఎదురు దెబ్బలు సుప్రీం కోర్టులో తగిలాయి. తాజాగా మరో ఎదురు దెబ్బ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో తగిలింది. ఆంధ్రప్రదేశ్ లో, తెలుగు మీడియం ఎత్తేసి, ఇంగ్లీష్ మీడియం పెట్టాలి అంటూ, ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన జీవలో 81,85 లను, హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. ఇది చట్టానికి విరుద్ధం అని, మాతృభాషలో విద్యాబోధన ఉండాలని, దీనికి సంబంధించి చట్టం కూడా ఉందని, హైకోర్టు తీర్పు ఇస్తూ, ప్రభుత్వం ఇచ్చిన జీవోలను కొట్టేసింది. అయితే, దీని పై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళింది. ఏప్రిల్ నెలలో హైకోర్టు కేసు కొట్టేయగానే, రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్వే చేసింది. రాష్ట్రంలో 85 శాతం మంది ఇంగ్లీష్ మీడియం కావాలి అనుకుంటున్నారు అంటూ, రాష్ట్ర ప్రభుత్వం తన పిటీషన్ లో తెలిపి, సుప్రీం కోర్టులో పిటీషన్ వేసింది. దీని పై ఈ రోజు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వం తరుపున లాయర్ మాట్లాడుతూ, ఇది రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయం కాదని, రాజ్యాంగంలో ఎక్కడా మాతృభాషలోనే ప్రాధమిక విద్యాబోధన ఉండాలని ఎక్కడా లేదని సుప్రీంకు తెలిపారు.

sc 03092020 2

అలాగే ఇంగ్లీష్ మీడియం అనేది ప్రభుత్వ స్కూల్స్ కే పెట్టాం అని, ప్రైవేటు స్కూల్స్ కి కాదని వాదించారు. ఇది ఏ విధంగా తప్పు కాదని, రాజ్యాంగ విరుద్ధం కాదు అంటూ వాదించారు. అందుకే దీన్ని అనుమతి ఇస్తూ, హైకోర్టు ఇచ్చిన తీర్పు పై స్టే ఇవ్వాలని కోరారు. అయితే ఈ సందర్భంగా జడ్జి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తెలుగు మీడియం బోధన అవకాసం లేని చోట, వేరే భాషలో బోధన చెయ్యవచ్చు కానీ, అవకాసం ఉన్న చోటు కూడా, వేరే భాష ఎందుకు అని ప్రశ్నించారు. అయితే దీనికి స్పందిస్తూ, తమకు ఇంగ్లీష్ మీడియం కావాలని అత్యధికులు కోరుతున్నారని కోర్టుకు తెలిపారు ప్రభుత్వ తరుపు న్యాయవాది. పదే పదే హైకోర్టు ఆదేశాల పై స్టే ఇవ్వాలని కోరినా, సుప్రీం కోర్టు మాత్రం స్టే ఇవ్వటానికి నిరాకరిస్తూ, కేసుని 25కి వాయిదా వేసింది. అలాగే ఎస్ఎల్పీ, స్టే విషయం పై ప్రతి వాదులు అందరికీ నోటీసులు ఇచ్చింది. దీని పై అభిప్రాయం కోరింది. అయితే మొదటి నుంచి అందరూ కోరేది, ఇంగ్లీష్ మీడియంతో పాటుగా, తెలుగు మీడియం కూడా ఆప్షన్ పెట్టమని. మరి ఆప్షన్ ఇవ్వటానికి ప్రభుత్వానికి ఇబ్బంది ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఆప్షన్ ఇస్తే అయిపోయే దానికి, ప్రభుత్వం ఇక్కడ వరకు తెచ్చుకుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read