ఎదురు దెబ్బ, మొట్టికాయలు, చీవాట్లు,... ఇవన్నీ ప్రతి రోజు కామన్ అయిపోయాయి... కింద కోర్టులు దగ్గర నుంచి, హైకోర్టు, సుప్రీం కోర్టు దాకా, అన్ని కోర్టులు మీరు తీసుకునే నిర్ణయాలు చట్ట విరుద్ధం, న్యాయబద్ధం కాదు అని పదే పదే చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం, ఏ మాత్రం పట్టించుకోవటం లేదు. రాస్తున్న మీడియాకి, వ్యాఖ్యలు చేస్తున్న కోర్టులకు విసుగు పుడుతుంది ఏమో అని, ప్రభుత్వానికి మాత్రం ఏమి అనిపించటం లేదేమో అని అర్ధం అవుతుంది. తాజాగా, రాష్ట్ర ప్రభుత్వానికి, సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్ర మాజీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో, హైకోర్టులో నిమ్మగడ్డ కోర్టు ధిక్కరణ కేసు వేసిన సంగతి తెలిసిందే. తనను రీస్టోర్ చెయ్యాలని ఉన్నా సరే, ప్రభుత్వం ఒప్పుకోవటం లేదని ఆయన పిటీషన్ వేసారు. అయితే, దీని పై స్పందించిన కోర్టు, గవర్నర్ వద్దకు వెళ్లి, విషయం చెప్పి, కోర్టు ఆదేశాలు పాటించాల్సిందిగా కోరమని ఆదేశించింది. అయితే, దీని పై స్పందించిన గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇస్తూ, కోర్టు తీర్పుని అమలు చెయ్యమని కోరారు.
అయితే రాష్ట్ర ప్రభుత్వం, ఈ పరిణామం జరగగానే, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళింది. హైకోర్టులో వేసిన కోర్టు ధిక్కరణ పై స్టే ఇవ్వాలని సుప్రీం కోర్టులో కేసు వేసింది. దీని పై ఈ రోజు విచారణ జరిగింది. దీని పై స్పందించిన సుప్రీం కోర్టు, ఆ పిటీషన్ కొట్టేసింది. ప్రభుత్వం స్టే ఇవ్వమని కోరగా, మేము ఇవ్వం అంటూ పిటీషన్ కొట్టేసింది. దీంతో, రమేష్ కుమార్ వ్యవహారంలో, ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేస్తుందో చూడాలి. ఇప్పటికే, రెండు సార్లు ఇదే విషయం పై సుప్రీం కోర్టులో స్టే ఇవ్వమని కోరగా, సుప్రీం కోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. అయితే మళ్ళీ సుప్రీం కోర్టుకు వెళ్ళటంతో, మళ్ళీ సుప్రీం కోర్టు కొట్టేసింది. తమకు సమాధానం ఇవ్వటానికి కొంత సమయం కావాలని, ప్రభుత్వం తరుపు న్యాయవాది అడగుతూ, అప్పటి వరకు ఆగాలి అని చెప్పినా, సుప్రీం కోర్టు మాత్రం, ఇంకా దీని పై ఏమి లేదు అంటూ, కేసు కొట్టేసింది. ఇప్పటికైనా, సాగ తియ్యకుండా, ప్రభుత్వం ఏమి చేస్తుందో చూడాలి.