క-రో-నా కాలంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టాలి అనుకుంటున్న పది, ఇంటర్ బోర్డు ఎక్షామ్స పై ఈ రోజు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ పరీక్షలు నిర్వహించి తీరుతాం అని, జూలై చివరి వారంలో పరీక్షలు పెడుతున్నాం, దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా పక్కాగా చేసాం అంటూ, ఏపి ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే ఈ అఫిడవిట్ పై సుప్రీం కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎటువంటి ఏర్పాట్లు చేసారు, ఎన్ని రూమ్లు ఉన్నాయి, ఎంత మంది స్టాఫ్ ఉన్నారు, ఇలా సమగ్రంగా సమాచారం ఇవ్వకుండా, పరీక్షలు నిర్వహించి తీరుతాం అని ఒకే ఒక్క మొండి పట్టుదలతో చేస్తున్నారు తప్పితే, చిత్తశుద్ది కనిపించటం లేదు అంటూ, సుప్రీం కోర్టు పేర్కొంది. పైగా పరిస్థితిలు మారిపోతున్నాయి, ఎప్పుడు ఎలా ఉంటుందో అర్ధం కావటం లేదు, మూడో వేవ్ కూడా వస్తుందని అంటున్నారు, సెకండ్ వేవ్ లో జరిగిన అనర్ధాలు చూసాం. మన చేతిలో లేకుండా మొత్తం జరిగిపోతున్నాయి. మనం అనుకున్నది ఏది మన అంచనాలో ఉండదు. ఇప్పుడు మూడో వేవ్ కూడా వస్తుందని అంటున్నారు. జూలై మూడో వారంలో పరీక్షలు పెడతాం అంటున్నారు, మరి మూడో వేవ్ జూలై మూడో వారం లోపే వస్తే ఏమి చేస్తారు అంటూ సుప్రీం కోర్టు ప్రశ్నించింది. అప్పుడు పరీక్షలు ఆపేస్తారా అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.

sc 24062021 2

ఒక్కో రూమ్ లో 15 మంది కూర్చోపెడతాం అంటున్నారు, దానికి 34 వేల రూమ్స్ కావాలి, అన్ని రూమ్స్ మీ దగ్గర ఉన్నాయా, అంత మంది స్టాఫ్ కావలి, పేపర్లు కాలేచ్ట్ చేయాలి, కరెక్ట్ చేయాలి, ఇప్పుడున్న పరిస్థితిలో, ఇది సాధ్యం అయ్యే పనేనా అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. పరీక్షలు నిర్వహణ మధ్యలో ఈ వేవ్ ఎక్కువగా ఉండి, వైరస్ ఎక్కువగా స్ప్రెడ్ అయితే, ఆ విషయంలో ఏమి చెప్తారు. మరి ఇలాంటి వాటి అన్నిటి పై మీకు ఏమైనా ప్లాన్ ఉందా ? ఇప్పుడు మీరు వేసిన ప్రణాలికలో మార్పులు వస్తే, దానికి అనుగుణంగా మీరు ఏమి చేస్తారు అని ప్రశ్నలు సందించింది. మీ దగ్గర ఏమి ప్లాన్ లేకుండా, ఏమి చెప్పకుండా, పరీక్షలు నిర్వహిస్తాం అంటే ఎలా అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. అన్ని రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేసినాయి కదా, మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి అని ప్రశ్నించింది. ఒక్క విద్యార్ధి వైరస్ తో చనిపోయినా, దానికి మీరే బాధ్యత అంటూ కోర్టు చెప్పింది. మీరు దీని పై ఒకటికి రెండు సార్లు చర్చించండి, ఆలోచన చేయండి, రేపటి లోగా మళ్ళీ మీ నిర్ణయం చెప్పండి అంటూ, కోర్టు తెలిపింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read