సిబిఐ పనితీరు పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సిబిఐ పని తీరుకు సంబంధించి, అనేక రాష్ట్రాల హైకోర్టులు, అలాగే సుప్రీం కోర్టు కూడా పలు మార్లు విమర్శలు చేస్తూ, ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా సుప్రీం కోర్టు ధర్మాసనం, సిబిఐ పని తీరు పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఏకంగా సిబిఐ డైరెక్టర్ కు నోటీస్ కూడా పంపించింది. ఆరు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. అసలు సిబిఐ ఇంత వరకు చేసిన కేసులు ఎన్ని సక్సెస్ అయ్యాయి, ఇప్పటి వరకు ఉన్న పెండింగ్ కేసులు ఎన్ని, అసలు మీకు సిబ్బంది పరంగా, సాంకేతికంగా, ఇతర మౌళిక సదుపాయాల పరంగా మీకు ఉన్నటు వంటి ఇబ్బందులు ఏమిటి, ఇవన్నీ కూడా చెప్పాలని, దీని పై ఆరు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం ధర్మాసనం, సిబిఐ డైరెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా, గతంలో సిబిఐ పై మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను కూడా ఈ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రస్తావించింది. మద్రాస్ హైకోర్టు గతంలో సిబిఐ విచారణను తప్పు పడుతూ, సిబిఐ స్వతంత్ర దర్యాప్తు సంస్థగ ఉండాలని, ఒత్తిడిలకు గురి కాకూడదని, ఎందుకు సిబిఐ ఇలా పని చేస్తుందో అర్ధం కావటం లేదు, పని తీరు అధ్వానంగా ఉంది అని చెప్తూ, సిబిఐని పంజరంలో ఉన్న చిలుకతో పోల్చింది.

sc 06092201 2

పంజరంలో ఉన్న చిలుకకు స్వేఛ్చ కావాలి అంటూ, స్వేఛ్చను సిబిఐ తానంతట తానే తీసుకుని, స్వతంత్రంగా దర్యాప్తు చేయవలసిన అవసరం ఉందని, మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలను కూడా ఈ రోజు సుప్రీం కోర్టు ప్రస్తావించింది. సిబిఐ పై వస్తున్న విమర్శలకు సిబిఐ సమాధానం ఇవ్వాలని, సిబిఐ ఎందుకు పని తీరు మెరుగుపరుచుకోలేక పోతుంది, సిబిఐ చేపట్టిన కేసులు ఎందుకు కోర్టులో నిలబడ లేక పోతున్నాయి. ఇప్పటి వరకు సిబిఐ చెప్పటిన కేసులు ఎన్ని, ఎన్ని నిలబడ్డాయి, ఇవన్నీ కూడా ఆరు వారాల్లో సుప్రీం కోర్టుకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఏదైతే జమ్మూ కాశ్మీర్ కు సంబందించి, ఇద్దరు న్యాయవాదులను అరెస్ట్ చేయటం, వారి పై బలవతంగా ఆరోపణలు చేసి, సిబిఐ దాఖలు చేసిన చార్జ్ షీట్ పై సుప్రీం కోర్టు ఈ రోజు వ్యాఖ్యలు చేసింది. సిబిఐ పని తీరు పై వస్తున్న విమర్శలు, ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా ప్రస్తవాన చేయటంతో, ఇప్పటికైనా సిబిఐ తన పని తీరు మార్చుకుని, ప్రక్షాళన చేస్తుందో లేక సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాల్సి వస్తుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read