ప్రజాప్రతినిధుల పై నమోదు అయిన కేసుల దర్యాప్తు నత్త నడకగా సాగుతూ ఉండటం పై, సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ అంశం పై సుప్రీం కోర్టులో వాడీ వేడిగా చర్చ జరిగింది. దాదాపుగా రెండు గంటల పాటు వాదోపవాదనలు కొనసాగాయి. ప్రధానంగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రజాప్రతినిధుల కేసులు విషయం పై, జరుగుతున్న జాప్యం విషయంలో, ఎందుకు జాప్యం జరుగుతుంది అంటూ చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. వివిధ కేసుల్లో శిక్షలు పడి ప్రజా ప్రతినిధులు ఎన్నికల్లో పోటీ చేయకుండా, జీవితకాలం నిషేధం విధించటం పై , పార్లమెంట్ నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఇలా కేసులు ఉన్న ప్రజాప్రతినిధుల పై జీవిత కాల నిషేధం పై, తాను గతంలోనే ప్రతిపాదించినట్టు చెప్పారు. కేసులు విషయంలో జాప్యం పై సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వ్యవహరిస్తున్న తీర్పు పై, ఆయన పూర్తిగా తప్పుబట్టారు. దర్యాప్తు సంస్థలు అయిన సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీరు పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. కేసులు విచారణ జాప్యం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసారు. కొందరి నేతల పైన కేసులు విచారణ పది నుంచి, 15 ఏళ్ళ వరకు పెండింగ్ లో ఉంటున్నాయని వ్యాఖ్యానించారు. సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రెండిటి పైన, అసహనం వ్యక్తం చేసారు.

sc 27082021 2

ప్రజా ప్రతినిధుల కేసులు విషయం పై, అమికస్ క్యూరీ ఒక నివేదికను సమర్పించారు. అందులో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణలో 51 మంది ఎంపీలు, మరో 71 మంది ఎమ్మెల్యేలు నిందితులుగా ఉన్నట్టు సుప్రీం కోర్టుకు తెలిపారు. ఇక సిబిఐ దగ్గర విచారణలో 181 మంది విచారణలో ఉన్నట్టు కోర్టుకు తెలిపారు. 55 మంది విషయంలో సీరియస్ కేసులు ఉన్నాయని, జీవిత ఖైదు, పదేళ్ళ పైన శిక్షలు పడే కేసులు ఉన్నాయని తెలిపారు. ఇందులో 45 కేసుల్లో ఇంకా అభియోగాలు కూడా నమోదు కాలేదని కోర్టుకు తెలిపారు. విచారణ సంస్థలు కూడా మానవ వనరులు కొరతను ఎదుర్కుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన కోర్టు, సిబిఐ కేసులు ఎక్కువ అయిపోతున్నాయని వ్యాఖ్యలు చేసారు. అయితే సుప్రీం కోర్టు చేసిన ఈ కామెంట్స్ జగన్ కేసుల్లో కూడా వర్తిస్తుందని అంటున్నారు. దాదపుగా 10 ఏళ్ళుగా జగన్ కేసులు పై ఇంకా ట్రైల్స్ కూడా మొదలు కాలేదని, ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మరి సుప్రీం చేసిన ఈ వ్యాఖ్యలు, కేసులు పై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read