దేశంలో టెన్త్, ఇంటర్, అలాగే మిగిలిన పరీక్షల విషయంలో, వివిధ రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయం పై, సుప్రీం కోర్టులో ఒక పిటీషన్ దాఖలు అయ్యింది. ఈ పిటీషన్ పై గతంలో వాదనలు జరగగా, ఈ రోజుకి పిటీషన్ వాయిదా పడింది. ఈ పిటీషన్ ను, ఏఎం ఖాన్ విల్కర్, దినేష్ మహేశ్వరీ బెంచ్ విచారణకు తీసుకుంది. గత విచారణలో, దాదాపుగా అన్ని రాష్ట్రాల వారు తాము పరీక్షలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే కేవలం నాలుగు రాష్ట్రాలు మాత్రమే నిర్ణయం తీసుకోకుండా ఉన్నాయి, లేదా పరీక్షలు జరుపుతాం అని మొండి పట్టుదలలో ఉన్నాయి. ఆ నాలుగు రాష్ట్రాలు మన ఆంధ్రప్రదేశ్, అస్సాం, త్రిపుర, పంజాబ్. అయితే పోయిన వాయిదాలో, ఈ నాలుగు రాష్ట్రాలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. పరిస్థితి ఇలా ఉంటే పరీక్షలు ఎలా పెడతారు అంటూ, వారికి నోటీసులు ఇచ్చి, విచారణను ఈ రోజుకి వాయిదా వేసింది. అయితే ఈ రోజు విచారణ ప్రారంభం కాగానే, అస్సాం, త్రిపుర, పంజాబ్ రాష్ట్రాలు, తాము కూడా పరీక్షలు రద్దు చేస్తున్నాట్టు ప్రకటించాయి. తాము కూడా తమ బోర్డ్ ఎక్షామ్స రద్దు చేస్తున్నట్టు, సుప్రీం కోర్టుకు విన్నవించాయి. అయితే కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే, ఎటువంటి సమాధానం చెప్పలేదు. అయితే దీని పై ఆంధ్రప్రదేశ్ స్టాండింగ్ కౌన్సిల్ అడ్వొకేట్ మహ్ఫూజ్ నజ్కి సమాధానం ఇచ్చారు.

sc 21062021 2

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు నిర్వహించాలని ఒక పాలసీ నిర్ణయం తీసుకున్నట్టు కోర్టుకు తెలిపారు. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే, తాము పరీక్షలు నిర్వహిస్తాం అంటూ, సుప్రీం కోర్టుకు చెప్పటంతో, విద్యార్ధులు అవాక్కయ్యారు. సుప్రీం కోర్టు జోక్యంతో అయినా, ప్రభుత్వం దిగి వస్తుందని అనుకున్నారు. అయితే సుప్రీం కోర్టు దీని పై రేపు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చే అవకాసం ఉంది. కేరళ ప్రభుత్వం 11వ తరగతి పరీక్షలు రద్దు చేసే విషయమై తాము ఒక వారంలో సమాధానం చెప్తాం అని చెప్పగా, సుప్రీం కోర్టు మాత్రం రేపు మీ నిర్ణయం చెప్పాలి, లేకపోతే మేమే నిర్ణయం ప్రకటిస్తాం అని తేల్చి చెప్పింది. అంటే దీని బట్టి, రేపు సుప్రీం కోర్టు ఆదేశాలు ఇవ్వనుంది. రేపు మధ్యానం 2 గంటలకు విచారణకు వస్తుంది. అయితే ఇప్పటికే అన్ని రాష్ట్రాలు, కేంద్రం కూడా రద్దు చేయటంతో, ఇక ఆంధ్రప్రదేశ్ విషయంలో, అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఇతర పరీక్షల విషయంలో, సుప్రీం కోర్టు రేపు క్లారిటీ ఇచ్చే అవకాసం ఉంది. మరి రేపు సుప్రీం కోర్టు , ఏపి విషయంలో ఏమి చెప్తుందో అనే టెన్షన్ నెలకొంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read