మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో మొట్టికాయలు పడ్డాయి. హైకోర్టు, సుప్రీం కోర్టు, ఇలా అన్ని కోర్టుల్లో ప్రభుత్వ విధానాల పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పదవ తరగతి, అదే విధంగా ఇంటర్ పరీక్షలు రద్దు చేసే విషయంలో, దేశంలోని అన్ని రాష్ట్రాలు స్పందించిన తరువాత కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము స్పందించక పోవటం పై, సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు పరీక్షల పై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవటం పై ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి అఫిడవిట్ కూడా ఫైల్ చేయలేదని, కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో అన్ని రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్న తరువాత, మీరు నిర్ణయం తీసుకోవటానికి ఇబ్బంది ఏమిటి, అంటూ కోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మిమ్మల్ని ఎందుకు మినహాయించాలని సూటిగా ప్రశ్నించింది. ఈ రోజు సిఈఎస్ఈ, ఐసిఎస్ఈ, అదే విధంగా అన్ని రాష్ట్రాల బోర్డులు పరీక్షల విషయంలో తీసుకునే నిర్ణయం పై దాఖలు అయిన, పిటీషన్ విచారణ సందర్భంలో, ఇప్పటి వరకు 21 రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల్లో ఉన్న బోర్డు పరీక్షలు రద్దు చేస్తున్నట్టుగా సుప్రీం కోర్టుకు తెలిపాయి. అలాగే కొన్ని రాష్ట్రాలు కో-వి-డ్ సెకండ్ వేవ్ కంటే ముందే పరీక్షలు పూర్తి చేసుకున్నాయి.
అయితే నాలుగు రాష్ట్రాల విషయంలో సుప్రీం కోర్టు అభిప్రాయం చెప్పమని కోరింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. అయితే ఇప్పటికే మిగతా మూడు రాష్ట్రాలు తమ అభిప్రాయం చెప్తూ, పరీక్షలు రద్దు చేస్తున్నట్టు సుప్రీం కోర్టుకు తెలిపాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం, ఇప్పటి వరకు అఫిడవిట్ దాఖలు చేయలేదు. అస్సాం, పంజాబ్, త్రిపుర రాష్ట్రాలు రద్దు చేస్తున్నట్టు తెలిపాయి. అయితే కేరళ రాష్ట్రం 11వ తరగతి పరీక్షలు విషయంలో వివరణ ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ మాత్రం పది, ఇంటర్ పై స్పష్టత ఇవ్వలేదు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం, ఎటువంటి స్పష్టత ఇప్పటి వరకు కోర్టుకు తెలపకపోవటం పై, సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకు ఫైల్ చేయలేదు ? ఇప్పటి వరకు ఎందుకు నిర్ణయం తీసుకోలేదు? పరీక్షలు పెట్టి విద్యార్ధులకు క-రో-నా సోకితే ఎవరు బాధ్యత వహిస్తారు ? ఈ అనిశ్చితి ఏమిటి అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. పరీక్షల నిర్వహణ విషయంలో ఇంత అలసత్వం పనికిరాదని, ఒక్క విద్యార్ధి క-రో-నా తో మరణించినా, రాష్ట్రం బాధ్యత వహించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. గురువారం లోపు నిర్ణయం చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. తుది తీర్పు చెప్తామని ధర్మసనం చెప్పింది.