రాజధాని అమరావతి భూములు కొనుగోలుకు సంబంధించి, అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అంటూ, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో ఎఫ్ఐఆర్ దాఖలు చేయటం, దాన్ని హైకోర్టు కొట్టివేయటం జరిగింది. రాజధానిలో అసలు రహస్యం ఏముంది ? ఇదంతా ఓపెన్ సీక్రెట్ కదా, అందరికీ అక్కడ రాజధాని వస్తుందని తెలిసిందే కదా, మీరు ఆరోపణలు చేస్తున్న కొనుగోళ్ళు రాజధాని ప్రకటన తరువాతే భూములు కోనోగుళ్ళు జరిగాయి కదా, ఇంకా దీంట్లో ఇన్సైడర్ ట్రేడింగ్ ఎక్కడ ఉంది అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు పై, ఏపి ప్రభుత్వం ఆ తీర్పుని సవాల్ చేస్తూ, సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్ పై, ఈ రోజు న్యాయమూర్తులు వినీత్ శరన్, అదే విధంగా దినేష్ లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ విచారణ సందర్భంగా వాడీ వేడిగా వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరుపున, దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. అప్పట్లో ప్రభుత్వ పెద్దలు, ప్రైవేటు పార్టీలు కలిసి దోచుకున్నాయని అన్నారు. ముందుగానే కుమ్మక్కు అయ్యి, అక్కడ ఆస్తులు కొనుగోలు చేసారని, దీని వల్ల లబ్ది పొందారని, అందుకే ఏపి ప్రభుత్వం దీంట్లో స్కాం జరిగిందని భావించే విచరణ చేసిందని, ఇందులో తప్పు ఉందనే తమ ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని తెలిపారు.

amaravati 16072021 2

అయితే హైకోర్ట్ మాత్రం ప్రాధమిక విచారణలోనే దీని పై క్లీన్ చిట్ ఇచ్చి, అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదని చెప్పారు. ఏప్రిల్ 2015లో ఏపి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని, అయితే 2014లోనే భూములు కొనుగోళ్ళు జరిగాయని వాదించారు. అయితే సుప్రీం కోర్టు ధర్మాసనం మాత్రం దీంతో ఏకీభవించలేదు. హైకోర్టు చెప్పిన దాంట్లో తప్పు ఏముంది ? హైకోర్టు అన్ని విషయాలు చెప్పింది కదా ? అన్నీ పరిశీలించిన తరువాతే తీర్పు ఇచ్చినట్టు అర్ధం అవుతుందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. రాజధాని అనేది బహిరంగ రహస్యం కదా, అసలు మీకు హైకోర్టు ఇచ్చిన తీర్పులో, ఎక్కడ తప్పు అనిపించింది ? ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కు అయ్యారని, రాజధాని అక్కడ అని లీక్ చేసారని ఆధారాలు ఏమున్నాయి ? ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది నిజమే అనుకుంటే, ఏ సెక్షన్ కింద కేసు పెట్టాలి అంటూ, సుప్రీం ప్రశ్నల వర్షం కురిపించింది. దీనికి ప్రభుత్వ న్యాయవాది సరైన సమాధానం చెప్పలేక పోయారు. అమరావతి పై మరో కేసు కూడా ఉందని, ఈ కేసుని దాంతో జత పరిచి విచారణ చేయాలని కోరగా, సుప్రీం కోర్టు ఒప్పుకోలేదు. ఇది వేరు అది వేరని సుప్రీం కోర్టు చెప్పింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read