ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతలకు వరుస ఘటనలతో ప్రతి రోజు టెన్షన్ గా మారింది. ఇప్పటికే జగన మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, ఇతర మంత్రులు కేసుల్లో ఇరుక్కుని, రేపో మాపో అనే ప్రచారం జరుగుతుంటే, ఇప్పుడు కొత్త కేసులు తెర మీదకు వచ్చి వైసిపీ పార్టీని మరింత టెన్షన్ పెడుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్ పై ప్రాధమిక దర్యాప్తు జరిపి, కొత్తగా ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలి అంటూ సుప్రీం కోర్టు ఆదేశించటం సంచలనానికి తెర లేపింది. ఇందులో సిబిఐ ఎందుకు వచ్చిందా అనే ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మంత్రి పైనే కాకుండా, అయన భార్య విజయలక్ష్మి పైన కూడా విచారణ జరపాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే మంత్రి ఆదిమూలపు సురేశ్ రాజకీయాల్లోకి రాకముందు ఐఆర్ఎస్ అధికారి. ఆయన భార్య కూడా ఐఆర్ఎస్ అధికారే. మంత్రి సురేష్ రాజకీయాల్లోకి 2009లో వచ్చారు. అంతకు ముందు ఆయన ఐఆర్ఎస్ ఆఫీసర్ గా పని చేసే వారు. అయితే ఐఆర్ఎస్ ఆఫీసర్ల పై ఒక స్పెషల్ డ్రైవ్ చేపట్టింది సిబిఐ. ఐఆర్ఎస్ ఆఫీసర్ల పై అవినీతి ఆరోపణలు రావటంతో, 2016 సమయంలో దేశ వ్యాప్తంగా ఉన్న ఐఆర్ఎస్ ఆఫీసర్ల పై సిబిఐ అధికారులు రైడ్స్ చేసారు.
ఈ సోదాల్లో మంత్రి సురేష్, ఆయన భార్య కూడా ఆదాయానికి మించిన ఆస్తులు కూడ బెట్టారని సిబిఐ గుర్తించింది. ఇద్దరి పైన 2017లో సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మంత్రిగారి భార్య ఏ1గా ఉండగా, మంత్రి ఏ2గా ఆన్నారు. అప్పటికే సురేష్ ఉద్యోగ విరమణ చేసినా, ఆయన ప్రోద్భలంతోనే , ఆయన భార్య ఆదాయానికి మించిన ఆస్తులు వెనకేసరని సిబిఐ అభియోగం. అయితే తమ పై కనీసం ప్రాధమికంగా విచారణ కూడా చేయకుండా, సిబిఐ తమ పై చార్జ్ షీట్ దాఖలు చేసింది అంటూ, మంత్రి సురేష్ ఆయన భార్య, హైకోర్టుని ఆశ్రయించారు. దీంతో హైకోర్టు మంత్రి దంపతుల వాదనతో ఏకీభావించి, ఆయన పై నమోదు అయిన ఎఫ్ఐఆర్ కొట్టేసింది. అయితే దీని పై సిబిఐ, సుప్రీం కోర్టుకు వెళ్లి అపీల్ చేసింది. దీని పైన నిన్న సుప్రీం కోర్టులో జస్టిస్ డి.వై. చంద్రచూడ్ ధర్మాసనం విచారణ చేసింది. అధికారుల ముందు కేసులు నమోదు చేసే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూనే, ప్రాధమిక దర్యాప్తు జరిపి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, సిబిఐని ఆదేశించింది. దీంతో ఇప్పుడు మళ్ళీ మంత్రి దంపతుల పై సిబిఐ విచారణ చేయనుంది.