ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుని, రాష్ట్ర ప్రభుత్వం గంట రెండేళ్లుగా ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా వేధిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఆయన పై ఎలాంటి అభియోగాన్ని నిరూపించలేక పోయారు. దీంతో ఆయన సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర పై పసలేని ఆరోపణలు చేస్తే, ఆయన సస్పెన్షన్ ను ఏడాదికి పైగా పొడిగించటాన్ని, సవాల్ చేస్తూ, ఏబీవెంకటేశ్వరరావు, సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విషయం పై, ఈ రోజు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసు పై ఈ రోజు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఏబీ వెంకటేశ్వర రావు పై ఉన్న ఆరోపణలు పై, దర్యాప్తు మొత్తం ఏప్రిల్ 6 లోపు పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చింది. రోజు వారీ దర్యాప్తు ఎందుకు చేయటం లేదని, రోజు వారీ దర్యాప్తు చేసి, కేసుని వెంటనే క్లోజ్ చేయాలని పేర్కొంది. ఏప్రిల్ 30వ తేదీన, ఈ నివేదిక మొత్తం కోర్టుకు సమర్పించాలని, ఆదేశాలు ఇచ్చింది. తదుపతి విచారణను మే 3 వ తేదీకి వాయిదా వేసింది. ఆ లోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అయితే ఈ సమయంలో, రాష్ట్ర ప్రభుత్వం తరుపున న్యాయవాది కలుగు చేసుకుని, తమకు ఆరు నెలల సమయం కావాలని, ఈ కేసు విచారణకు ఆరు నెలలు పడుతుందని కోర్టుకు తెలిపారు. అయితే దీని పై కోర్టు ఘాటుగా స్పందించింది.
ఏడాదికి పైగా సస్పెన్షన్ వేటు వేసి, కాలం గడుపుతున్న సమయంలో, ఇప్పుడు మళ్ళీ ఇంకో ఆరు నెలలు ఎందుకు ? రోజు వారీ విచారణ చేపట్టి, ఈ కేసుని పూర్తి చేయండి అంటూ, రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదికి కోర్టు సూచించింది. అయితే అవినీతి ఆరోపణలు లేననుంది, రివ్యూ కమిటీ ఏడాదికి పైగా పొడిగించటానికి వీలు లేదని, ఏబి వెంకటేశ్వరరావు తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. అలాగే ఈయన మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉన్నప్పుడు, ఈయన పై ఆరోపణలు మోపితే, వేరే డిపార్టుమెంటు లో పోస్టింగ్ ఇవ్వచ్చు కదా, ఇప్పటి వరకు ఎందుకు దూరం పెట్టారు అని కోర్టు ప్రశ్నించింది. ఒక సీనియర్ అధికారిని ఇంత కాలం ఎందుకు పోస్టింగ్ ఇవ్వలేదని, ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కోర్టు. కేసు దర్యాప్తులో ఉందని, అందుకే పోస్టింగ్ ఇవ్వటం కుదరలేదని ప్రభుత్వం తరుపు న్యాయవాది చెప్పగా, ఈ కేసుని వేగంగా దర్యాప్తు చేసి, తమకు నివేదిక ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ తగిలింది. నిరుపించటానికి ఏమి ఆధారాలు లేకపోవటం, ఇలాగే సాగదీయాలని ప్రభుత్వం వేసిన ఎత్తులకు, సుప్రీం కోర్ట్ బ్రేక్ వేసింది.