నీటి పై తేలియాడుతూ... నింగిలోకి దూసుకెళ్లి చక్కెర్లు కొట్టే ఆంఫీబియస్ సీ ప్లేన్ విన్యాసాలు కృష్ణానదిలో బుధవారం జరగనున్నాయి. పన్నమి ఘాట్లో ఉదయం 10 గంటలకు సీ ప్లేన్ విమాన విన్యాసాలు చూసేందుకు జిల్లా యంత్రాంగం 'ఎయిర్ క్రాఫ్ట్ షో" పేరిట ప్రజలకు అవకాశం కల్పిస్తోంది. ఇటీవల ముంబైలో సీ ప్లేన్ టెస్టింగ్ జరిగింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సీ ప్లేన్ ఎక్కి విహరించారు. ముంబై తర్వాత అమరావతి రాజధాని ప్రాంతంలోని విజయవాడ పన్నమి ఘాట్లో జరుగుతున్న సీ ప్లేన్ టెస్ట్ డ్రైవ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పరిశీలిస్తారు. ఆ తర్వాత విమానమెక్కి ఎలా పని చేస్తుందో చూస్తారు.

sea plane 13122017 2

సీఎంను ఎక్కించుకున్న తర్వాత ముందుగా నదిలో విమానాన్ని నడుపుతారు. ఈ క్రమంలోనే సీఎంకు సీ ప్లేన్కు సంబంధించిన స్పెసిఫికేషన్స్ గురించి వివరిస్తారు. ఒక్కసారిగా గగనతలంలోకి ఈ విమానం దూసుకు పోతుంది. ప్రజా ప్రతినిధులు, అధికారులను కూడా సీ ప్లేన్ నింగి లోకి తీసుకు వెళుతుంది. ఇక్కడికి వచ్చే ప్రజలలో కొందరికి కూడా అవకాశాలు కల్పి స్తుంది. అప్పటికప్పుడు ఎంపిక చేసిన వారిని సీ ప్లేన్లో ఎక్కించి చక్కెర్లు కొడతారు. సీ ప్లేన్కు జిల్లా యంత్రాంగం ఘాట్ దగ్గర జెట్టీని ఏర్పాటు చేయించింది. ముందుగా విమానాన్ని ఈ జెట్టీ మీదుగా తీసుకు వెళతారు. తర్వాత విమానంలోకి ఎక్కేవాళ్లు కూడా ఇదే జెట్టీ మీద నుంచి వెళ్లాల్సి ఉంటుంది.

sea plane 13122017 3

విమానయాన దిగ్గజ సంస్థలలో ఒకటైన స్పైస్ జెట్ నూతన సంవత్సరం నుంచి వీటిని ప్రారంభించాలని భావిస్తోంది. దాదాపుగా 100 విమానాలను ఆ సంస్థ కొనుగోలు చేస్తోంది. దేశ వ్యాప్తంగా పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో ఆపరేషన్స్ ప్రారంభిం చాలని భావిస్తోంది. అమరావతి రాజధాని ప్రాంతంలో కృష్ణానది కేంద్రంగా సీ ప్లేన్స్ నడ పాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే ఇక్కడ టెస్ట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. టెస్ట్ డైవ్ విజయవంతం అయితే రానున్న రోజుల్లో ఇక్కడి నుంచి కార్యకలాపాలు ప్రారంభి స్తుంది. సీ ప్లేన్ విమానం విన్యాసాల తర్వాత ఎన్ డీఆర్ఎఫ్ బృందాల డెమో ఉంటుంది. ప్రకృతి విపత్తుల సందర్భంగా ప్రమాదాలలో చిక్కుకున్న వారిని ఎలా రక్షిస్తారన్న దాని పై బృందాల ప్రదర్శన ఉంటుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read