ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యుల్ విడుదల అయిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శుక్రవారం రాత్రి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు. శనివారం రోజు నుంచి ఎన్నికల నియమావళి అమలులోకి వస్తుందని ఆ ఆదేశాల్లో తెలిపారు. దీని ప్రకారం, ఎలాంటి కొత్త పధకం, ప్రజలను ప్రలోభపెట్టే పనులు చేయ కూడదు. అయితే సోమవారం రెండో విడత అమ్మ ఒడి కార్యక్రమం మొదలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని. జగన్ మోహన్ రెడ్డి, నెల్లూరులో ఈ కార్యక్రమం ప్రారంభిస్తారు. అయితే, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి, ఈ కార్యక్రమం జరుగుతుందా లేదా ? లేకపోతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్ కు మధ్య నెలకొన్న వైరంతో, ఈ కార్యక్రమం ఏమి అవుతుంది అనే టెన్షన్ అందరిలో ఉంది. అయితే అమ్మఒడి కార్యక్రమం పై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేస్తూ, ఒక సర్క్యులర్ విడుదల చేసింది. ఇందులో రేపు జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించే అమ్మఒడి కార్యక్రమం పై, ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇచ్చింది. అమ్మోది పధకం గతంలో ఉన్న పధకమే కాబట్టి, ఈ కార్యక్రం ఎప్పటిలాగే ఈ సారి కూడా చేసుకోవచ్చు అని, ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. అయితే ఇలా చెప్తూనే, ఎన్నికల నియమావళి ఉంది కాబట్టి, కొన్ని షరతులు విధించింది.

ec 10012021 2

అమ్మ ఒడి కార్యక్రమం పై ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే గ్రామాల్లో చేపట్టే కార్యక్రమంలో, ప్రజాప్రతినిధులు ఎవరూ పాల్గునకూడదు అని ఎన్నికల కమిషన్ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు మాత్రమే గ్రామాల్లో ఈ కార్యక్రమంలో పాల్గునాలని స్పష్టం చేసింది. అయితే పట్టణ ప్రాంతాల్లో మాత్రం, ప్రజాప్రతినిధులు పల్గునవచ్చని తెలిపింది. దీంతో రేపు జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు వెళ్తూ ఉండటంతో, ఈ కార్యక్రమం కూడా పట్టాణ ప్రాంతంలో ఉండటంతో, ఇక్కడ కూడా ఈ కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే గ్రామాల్లో ఉన్న లబ్దిదారులను, పట్టాణాలకు పిలిచి కూడా, ఈ కార్యక్రమం చేయకూడదు అని స్పష్టం చేసింది. ఇక అలాగే ఇంటి పట్టాల కార్యక్రమం కూడా, పాత పధకమే కాబట్టి, ఇది కూడా చేసుకోవచ్చని, కానీ గ్రామాల్లో ప్రజాప్రతినిధులు కాకుండా, అధికారులు మాత్రమే చేయాలని తెలిపింది. మరి అధికార పార్టీ నేతలు, ఎన్నికల కమిషన్ చెప్పింది వింటారో లేదో, మళ్ళీ ఎలాంటి పరిస్థితి చూడాల్సి ఉంటుందో, రేపు కానీ తెలియదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read