రాష్ట్ర ఎన్నికల కమిషన్ మరో సంచలన నిర్ణయం తీసుకుని. ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న బలవంతపు ఏకగ్రీవాల పై రాష్ట్ర ఎన్నికల కమిషన్ మొదటి నుంచి ఫోకస్ పెట్టింది. బలవంతపు ఏకాగ్రీవాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంది. అసాధారణంగా ఉంటే చర్యలు తీసుకుంటామని చెప్పిన ఎన్నికల కమిషన్, ఇప్పుడు నిజంగానే అసాధారణంగా ఉన్న ఏకగ్రీవాల పై సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కొద్ది సేపటి క్రితం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో జరిగిన మొదటి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల విషయంలో, మిగతా జిల్లాలతో పోలిస్తే గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఏకగ్రీవాల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని, రాష్ట్ర ఎన్నికల గుర్తించినట్టు, ఈ రోజు రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక పత్రికా ప్రకటన ఇచ్చింది. ఈ నేపధ్యంలోనే, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఏకగ్రీవ ఫలితాలు ప్రకటించకుండా వెంటనే నిలిపి వేయాలని, ఆ రెండు జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. వీటిని ఎట్టి పరిస్థితిలో కూడా ఇప్పుడే ప్రకటించవద్దని, ఇవన్నీ కమిషన్ పరిశీలనలో ఉన్నాయని, తమకు దీని పై పూర్తి స్థాయిలో నివేదికలు వచ్చిన తరువాతే, కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరువాతే మాత్రమే, ఏకగ్రీవాల ఫలితాలు ప్రకటించాలని, ఆ రెండు జిల్లాల కలెక్టర్లను ఎన్నికల కమిషన్ ఆదేశించింది. గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లను ఈ అంశం పై పూర్తి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్టు ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. ఈ నివేదికను పరిశీలిన చేసిన తరువాత, ఎక్కడైనా లోపాలు ఉన్నట్టు తేలితే, సంబంధిత అధికారుల పై చర్యలు కూడా తీసుకుంటామని స్పష్టం చేసింది.

nimmagadda 05020201 2

రాష్ట్రంలో మొత్తం 13 జిల్లాల్లో, మిగతా 11 జిల్లాల్లో జరిగిన ఏకాగ్రీవాలతో పోలిస్తే, గుంటూరు, కృష్ణా జిల్లాలో ఏకగ్రీవాల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నట్టు తేలిందని, ఎన్నికల కమిషన్ కొద్ది సేపటి క్రితం జారీ చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో, 454 పంచాయతీలకు, 110 గ్రామాల్లో ఏకాగ్రీవాలు అయ్యాయి. అలాగే గుంటూరు జిల్లాలో, 337 పంచాయతీలలో, 67 గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా జిల్లాల్లో చాలా తక్కువ అయ్యాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో తాను జరిగిపిన పర్యటన అందులో గమనించిన అంశాలు కూడా, ఎలక్షన్ కమిషన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా, ఎన్నికల యంత్రాంగం అంతా కూడా, బాగా పని చేస్తుందని, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు, అందరూ బాగా పని చేస్తున్నారని అన్నారు. దీంతో పాటు పోలీసులను కూడా ఎన్నికల కమిషన్ మేచ్చుకుంది. ముఖ్యంగా క-రో-నా వ్యాక్సినేషన్ పక్కన పెట్టి మరీ, రాజ్యంగ విధి అయిన ఎన్నికల నిర్వహణకు ముందుకు రావటం పట్ల, నిమ్మగడ్డ రాష్ట్రంలో ఉండే పోలీసు అధికారులు అందరికీ అభినందనలు తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read