వాలంటీర్ వ్యవస్థ పై సంచలన నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ఎలక్షన్ కమిషన్. వాలంటీర్ వ్యవస్థ మొత్తం వైసీపీ కార్యకర్తలతో నిమపేసాం అంటూ గతంలో విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు, వాలంటీర్లు తరుచూ వివాదాల్లో ఇరుకున్న వార్తలు, ఒక పార్టీకి కొమ్ము కాస్తూ వాలంటీర్లు చేస్తున్న అరాచకాల పై గతంలో అనేక సార్లు ప్రతిపక్ష పార్టీలు, ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత కూడా, పార్టీలు అన్నీ వాలంటీర్ వ్యవస్థ పై పని చేసాయి. రాష్ట్రంలో వాలంటీర్లు 90 శాతం మంది మన పార్టీ వాళ్ళే అంటూ, విజయసాయి రెడ్డి మాట్లాడిన వీడియో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. అయితే విపక్ష పార్టీలు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసిన నేపధ్యంలో, వాలంటీర్ల పై, సంచలన నిర్ణయం తీసుకుని ఎన్నికల కమిషన్. పంచాయతీ ఎన్నికల్లో, ఎన్నికలకు సంబందించిన విధుల్లో ఎక్కడా వాలంటీర్లు పల్గునకూడదని, ప్రాచారం చేయకూడదని, అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. అలాగే అభ్యర్ధులకు కావలసిన సర్టిఫికేట్లు ఇవ్వటంలో, తహసీల్దార్లు అలసత్వం వహిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. బుధవారం అన్నికాల జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ హెచ్చరికలు పంపించింది.
ఉద్యోగ సంఘాలు, మా పై తీవ్ర పద జాలంతో విరుచుకు పడినా, వాటిని పట్టించుకోవటం లేదని, అందరం కలిసి పని చేద్దాం అంటూ, రాష్ట్ర ఎన్నికల కమీషనర్, చీఫ్ సెక్రటరీని కోరారు. అందరం కలిసి ఎన్నికలు సజావుగా జరిగేలా చూద్దామని అన్నారు. అలాగే వీలైనంత ఎక్కువగా టెక్నాలజీని ఉపయోగించుకుందామని, ఎన్నికల కోసం ఒక ప్రత్యెక యాప్ ని కూడా తెస్తున్నట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది. అలాగే ఎక్కడా వ్యాక్సిన్ కు కూడా ఇబ్బంది లేకుండా చూడాలని, ఆదేశాలు ఇచ్చారు. మొన్నటి వరకు ఎన్నికలకు సహకరించం, సమీక్షలకు రాము అని చెప్పిన చీఫ్ సెక్రటరీ, అలాగే డీజీపీ, పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, అన్ని జిల్లాల కలెక్టర్లు సమావేశానికి హాజరు అయ్యారు. ప్రభుత్వం తరుపున తీసుకున్న చర్యలు అన్నీ, ఎలక్షన్ కమిషన్ కు వివరించారు. పోలీస్ వ్యవస్థ ప్రణాళికను కూడా డీజీపీ , ఎన్నికల కమీషనర్ కు వివరించారు. మొత్తంగా అందరూ కలిసి ఎన్నికలు సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.